ముంబైలో భారీ వర్షాలు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ

ABN , First Publish Date - 2021-06-11T15:46:19+05:30 IST

మహారాష్ట్ర: భారీ వర్షాలకు ముంబై మరోసారి అతలాకుతలమవుతోంది.

ముంబైలో భారీ వర్షాలు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ

మహారాష్ట్ర: భారీ వర్షాలకు ముంబై మరోసారి అతలాకుతలమవుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ముంబై ప్రజలను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ముంబైలోని భండూస్ వద్ద ఓ మహిళ  మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది.


రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా ముంబై నగరంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముంబైలోని మాహిం, అంధేరి ఈస్ట్ తదితర ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచింది. ముంబై నగరంతో పాటు భండారా, గోండియా, గడ్చిరోలి, విదర్భ ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ముంబైతో పాటు పరిసర జిల్లాలకు వాతావరణశాఖ  ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.

Updated Date - 2021-06-11T15:46:19+05:30 IST