Female friend brutality: మహిళా స్నేహితురాలి దారుణం..దగ్గరుండి బాలికపై సామూహిక అత్యాచారం చేయించిన వైనం

ABN , First Publish Date - 2022-08-19T16:03:31+05:30 IST

ఓ మహిళా స్నేహితురాలు దారుణానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరంలో వెలుగుచూసింది....

Female friend brutality: మహిళా స్నేహితురాలి దారుణం..దగ్గరుండి బాలికపై సామూహిక అత్యాచారం చేయించిన వైనం

ముంబయి: ఓ మహిళా స్నేహితురాలు దారుణానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని ముంబయి( Mumbai) నగరంలో వెలుగుచూసింది. ముంబయి నగరంలోని విరార్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ఓ మహిళ( తన స్నేహితురాలైన(female friend) మైనర్ బాలికను షికారుకంటూ ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి, ఆమె ముగ్గురు స్నేహితులను పిలిపించి వారితో దగ్గరుండి అత్యాచారం చేయించింది. బుధవారం తెల్లవారుజామున ముంబైలోని విరార్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు(Three of the accused) ఆమె 21 ఏళ్ల మహిళా స్నేహితురాలి కోరిక మేరకు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.21 ఏళ్ల మహిళా స్నేహితురాలు మాత్రం బాలికపై సామూహిక అత్యాచారం ఘటనను చూస్తూ ఉండిపోయింది.అత్యాచారం చేసిన ముగ్గురు నిందితులతోపాటు దీనికి వ్యూహం పన్నిన మహిళా స్నేహితురాలిని ముంబయి పోలీసులు ఆరు గంటల్లోనే అరెస్ట్ చేశారు.


మహిళా స్నేహితురాలే ఏకాంత ప్రదేశానికి బాలికను తీసుకువెళ్లి....

మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో బాధిత బాలిక(girl)తన సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి తన ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. దుకాణం వద్ద 21 ఏళ్ల మహిళా స్నేహితురాలు బాలికను కలిసి ఆమెను షికారుకంటూ ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి బందీగా ఉంచింది.తన ముగ్గురు స్నేహితులను పిలిపించిన మహిళ ముందుగా ఒక యువకుడితో లైంగిక సంబంధం పెట్టుకోమని కోరింది. అనంతరం మరో ఇద్దరు యువకులు వంతులవారీగా బాలికపై మహిళ సమక్షంలోనే(victs female friend watched) అత్యాచారం జరిపారు. బుధవారం తెల్లవారుజామున బాధిత బాలికను ఇంటి వద్ద వదిలేసి నిందితులు వెళ్లిపోయారు. 


బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు

బాలిక తల్లికి విషయం చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత బాలిక స్నేహితురాలిని పోలీసులు ఆరా తీశారు. నిందితుల్లో ఒకరు కళాశాల విద్యార్థి, మరొకరు కూరగాయల వ్యాపారి అని దర్యాప్తులో తేలింది. ఇద్దరూ విరార్ నివాసులని పోలీసులు చెప్పారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద సామూహిక అత్యాచారం, అసహజ సెక్స్, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారిని కస్టడీకి(arrested) తరలించామని ముంబయి పోలీసులు వివరించారు.


Updated Date - 2022-08-19T16:03:31+05:30 IST