Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 2 2021 @ 09:12AM

పశ్చిమబెంగాల్ సీఎం Mamata Banerjeeపై ముంబై బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు

ముంబై(మహారాష్ట్ర): జాతీయ గీతాన్ని అవమానించినందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ముంబై బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు.అసంపూర్ణంగా జాతీయ గీతాన్ని ఆలపించి, అవమానించారంటూ సీఎం మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ కూడా విమర్శలు గుప్పించింది.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారని ఆరోపిస్తూ బీజేపీ నేత కేసు పెట్టాడు. కూర్చున్న భంగిమలో జాతీయగీతాన్ని పాడి, ఆపై 4 లేదా 5 శ్లోకాల తర్వాత అకస్మాత్తుగా ఆపివేశారని ముంబై బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ముంబైలో విలేకరుల సమావేశంలో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న మమతా బెనర్జీ గీతం పూర్తి చేయకుండా మధ్యలో కూర్చున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.

‘‘మొదట కూర్చున్న మమతా బెనర్జీ ఆ తర్వాత లేచి నిలబడి భారత జాతీయ గీతాన్ని సగంలో పాడటం మానేశారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా మమతా బెంగాల్ సంస్కృతిని, జాతీయ గీతాన్ని, దేశాన్ని, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను అవమానించారు’’ అని పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ ట్వీట్ చేసింది.ముంబయిలో జరిగిన సభలో బెంగాల్ సీఎం మమతా జాతీయ గీతాన్ని అవమానించారు. ఆమెకు మర్యాద తెలియదా లేదా ఆమె తెలిసి అవమానించారా?అని బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షురాలు డాక్టర్ సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు. మమతాబెనర్జీపై ముంబై బీజేపీ నేత ప్రతీక్ కర్పే మండిపడ్డారు.జాతీయ గీతంపై మమతా బెనర్జీ ప్రవర్తన సిగ్గుచేటు అంటూ భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు.


Advertisement
Advertisement