ములుగులో పులి సంచారం...స్థానికుల భయాందోళన

ABN , First Publish Date - 2021-11-13T14:33:26+05:30 IST

జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా రోజులుగా మంగపేట మండలం మొట్లగూడెం, నర్సింహాసాగర్ అడవుల్లో పులి సంచారిస్తోంది.

ములుగులో పులి సంచారం...స్థానికుల భయాందోళన

ములుగు: జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా రోజులుగా మంగపేట మండలం మొట్లగూడెం, నర్సింహాసాగర్ అడవుల్లో పులి సంచారిస్తోంది. ఐదు రోజుల క్రితం స్థానిక రైతులకు చెందిన ఆవుల మందపై పులి దాడి చేసింది. పులి పంచారాన్ని అధికారులు ధృవీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో దండోరాలు వేయించారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా పులులు ఇవే అంటూ  ఫేక్ వీడియోలను ఆకతాయిలు వైరల్ చేస్తున్నారు. పోకిరీ బ్యాచ్ పాత వీడియోలు పోస్ట్ చేస్తూ మరింత భయాందోళనలకు గురిచేస్తున్నారు.  ఫేక్ వీడియోలపై అటవీశాఖ అధికారులు ప్రచారం చేయకపోవడంతో మరింత గందరగోళం నెలకొంది. 

Updated Date - 2021-11-13T14:33:26+05:30 IST