ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం అభయారణ్యంలోని అడవుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. మంటల్లో చిక్కుకుని వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ అటవీశాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉంది. ఏటూరునాగారం - కమలాపూర్ అభయారణ్యంలో చెలరేగిన మంటలు ప్రధాన రహదారి వరకు వ్యాపించాయి. కమ్ముకున్న పొగలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి