ములుగు: మేడారం మహాజాతర నిర్వహణలో పోలీస్ అధికారుల అనుభవరాహిత్యం బయటపడింది. జాతరపై ఏ మాత్రం అనుభవం లేని కొత్త ఐపీఎస్ అధికారుల ఓవర్ యాక్షన్తో స్థానిక పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు. పోలీసుల అతిఉత్సాహం వల్ల జాతరకు రావడానికి సాధారణ భక్తులు హడలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. అటు ఆదివాసీ పూజారులతో కూడా దురుసుగా ప్రవర్తించారు. సారాలమ్మ పూజారిని అడ్డుకోవడంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల టెంట్లు కూల్చివేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు, ఆదివాసీల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది.
ఇవి కూడా చదవండి