కవాడిగూడ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైలం వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు.. అశ్రునయనాలతో వెంటరాగా.. దోమలగూడలోని కుమార్తె శివజ్యోతి నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం మొదలైన అంతిమయాత్ర.. మలక్‌పేట హిందూ శ్మశాన వాటిక వరకు సాగింది. అంతకుముందు పలువురు ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. కాగా, ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం శివైక్యమైన విషయం తెలిసిందే.