Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 15 2021 @ 16:11PM

గవర్నర్ ప్రసంగంలో పొగడ్తలు పెంచారు: సీతక్క

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేత కేసీఆర్ ప్రభుత్వం అసత్యాలు చేపించిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సీతక్క మీడియాతో మాట్లాడుతూ... కరోన సమయంలో ప్రభుత్వం పనితీరు నేరుగా గవర్నర్‌గా పరిశీలించారని.. కానీ ప్రసంగంలో బాగా చేసినట్లు గవర్నర్ చేత సీఎం కేసీఆర్ చేపించారని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంలో పేజీలు పెంచారు.. కేసీఆర్‌పై  పొగడ్తలు పెంచారని సెటైర్ వేశారు. ఈ ప్రభుత్వం అప్పులు పెంచి కొప్పులు పెడుతున్నట్లుగా చూపించారని ఎద్దేవా చేశారు. కేవలం ఆరురోజుల సమయంలో వందల కోట్ల బడ్జెట్‌పై ఏం చర్చించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సీతక్క నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. అయితే ఈప్రసంగాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. 

Advertisement
Advertisement