ములుగులో భారీ వర్షాలు...

ABN , First Publish Date - 2020-08-13T17:20:32+05:30 IST

జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ములుగులో భారీ వర్షాలు...

ములుగు: జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కన్నాయిగూడెం మండలం  తుపాకులగూడెం దేవాదుల ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి మరింత పెరిగింది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద  గోదవరి నీటిమట్టం పెరుగుతోంది. అటు తాడ్వాయి చిన్నబోయినపల్లి మధ్య రహదారిపై భారీ వృక్షం కూలింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు ఆరు ఇంచులతో లక్నవరం సరస్సు మత్తడి పోస్తోంది. 

Updated Date - 2020-08-13T17:20:32+05:30 IST