Abn logo
Sep 8 2021 @ 11:56AM

ములుగు జిల్లా: జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం

ములుగు జిల్లా: కరోనా మహమ్మారి మరోసారి కట్టలు తెంచుకుంటోంది. ములుగు జిల్లా, ఏటూరునాగారం ప్రభుత్వ పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పరీక్షలో ఉపాధ్యాయులకు పాజిటీవ్ రావడంతో కలకలం రేగింది. కరోనా సోకిన ఉపాధ్యాయులను అధికారులు హోం క్వారంటైన్‌కు తరలించారు. విద్యార్థులందరికీ కరోనా టెస్టులు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.