Abn logo
Sep 15 2021 @ 23:54PM

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు : కలెక్టర్‌

వెంకటాపురం(నూగూరు), సెప్టెంబరు 15: అభివృ ద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య అన్నారు. అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభితో కలిసి బుధవారం ఆయన మండలంలోని మల్లాపురం గ్రామసమీపంలో పాలెం వాగు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చే యాలన్నారు. ప్రాజెక్టుకు, కట్టపై రక్షణ చర్యల్లో భాగం గా గేట్లను ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కాల్వ పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టలని ఇరిగేషన్‌ అధికారులకు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న టెండర్‌ పనులు త్వరలో ప్రారంభించేలా చర్యలు చేపడతామన్నారు. అనంతరం మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌ అధికారులు, మండల అధికారులతో సమీక్షా సమావే శం నిర్వహించారు. వెంకటాపురం, వాజేడు మండలా ల్లో మిషన్‌ భగీరథ పనులు సక్రమంగా సాగడం లేద ని, నీటిసరఫరా సక్రమంగా జరగడం లేదని ఫిర్యాదు లు వస్తున్నాయని, పనులు సజావుగా సాగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూ చించారు. అదేవిధంగా పాఠశాలల మరమ్మతులకు కేటాయించిన నిధులతో పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. లేదంటే నిధులను రద్దు చేస్తామని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో ఫణిచంద్ర, జడ్పీటీసీ పాయం రమణ, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

ఏటూరునాగారం రూరల్‌ : ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గిరిజనుల చెంతకు చేరేలా సెక్టోరియల్‌ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు.  మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సెక్టోరియల్‌ అధికారులతో ఆయన  సమావేశమయ్యారు. ఐటీడీఏలో  సంక్షేమ పథకాల అమలు తీరును శాఖల వారీ గా సమీక్షించారు. ఐటీడీఏ పరిధిలోని సబ్‌సెంటర్లు, అం గన్‌వాడీ భవనాల నిర్మాణాలను పనులను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. గిరిజన రైతులకు మేలు జరిగే విధంగా గిరివికాసం పనులను త్వరగా చేపట్టాలన్నారు.  రైతుల దరఖాస్తులను త్వరిగతగిన పరిశీలించాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీల్లో సీజనల్‌ వ్యాఽధుల నివారణక చర్యలను వేగవంతం చేయాలన్నారు. పీహెచ్‌సీ వారీగా రోజూ రిపోర్ట్‌లను సమర్పించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో మంకిడి వెంకటేశ్వర్లును ఆదేశించారు.  ఏజెన్సీ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రజలకు అంటువ్యాధులు, సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఏపీవో వసంతరావు, ఏవో దామోదర స్వామి, మేనేజర్‌ లాల్‌నాయక్‌, ఎస్‌వో రాజ్‌కుమార్‌, ఈఈ హేమలత తదితరులు పాల్గొన్నారు.