ములుగును సమ్మక్క-సారక్క జిల్లాగా మార్చాలి

ABN , First Publish Date - 2020-02-07T15:43:07+05:30 IST

ములుగు జిల్లా పేరును సమ్మక్క-సారక్క జిల్లాగా మార్చాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమే్‌షకుమార్‌ మాదిగ డిమాండ్‌ చేశారు.

ములుగును సమ్మక్క-సారక్క జిల్లాగా మార్చాలి

కలెక్టరేట్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌ నాయకుల ధర్నా

కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌కు వినతి


ములుగు జిల్లా పేరును సమ్మక్క-సారక్క జిల్లాగా మార్చాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమే్‌షకుమార్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమే్‌షకుమార్‌ మాట్లాడారు. గద్వాల్‌ జిల్లాను జోగులాంబగా మార్చారని, కొత్తగూడెంను భద్రాద్రిగా, యాదగిరిగుట్టను యాదాద్రి జిల్లాగా, సిరిసిల్ల జిల్లాను వేములవాడ రాజన్న జిల్లాగా మార్చారని, ములుగు జిల్లాను సమక్క సారక్క జిల్లాగా మార్చాలని కోరారు. 

Updated Date - 2020-02-07T15:43:07+05:30 IST