Abn logo
Jul 1 2020 @ 00:15AM

మల్టీ కలర్‌ టచ్‌

రొనాల్డో రెండు రోజుల కిందట పెట్టిన ఫొటోను ఇప్పటికే 1.2 కోట్ల మంది లైక్‌ చేశారు.


ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అంటే కళ్లు చెదిరే ‘కిక్‌’లే కాదు... ఫ్యాషన్‌ ఫార్వార్డ్‌ కూడా! ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు ఓ ఫొటో పెట్టాడంటే... దానికి నిమిషాల్లో లక్షల కొద్దీ లైక్స్‌ వచ్చేస్తుంటాయి. ఆ ఫొటోలు కూడా సరికొత్త ట్రెండ్‌ను పరిచయం చేస్తున్నట్టుంటాయి. డిఫరెంట్స్‌ లుక్స్‌... మతి పోగొట్టే కాస్టూమ్స్‌తో అభిమానులను అలరించడంలో ఈ పోర్చుగల్‌ ఫుట్‌బాలర్‌ తరువాతే ఎవరైనా! అలాంటి ఫొటోనే ఇది. మల్టీకలర్‌ షార్ట్‌, షర్ట్‌లో రొనాల్డో ఇలా పోజిచ్చాడు. రెండు రోజుల కిందట పెట్టిన ఫొటోను ఇప్పటికి 1.2 కోట్ల మంది లైక్‌ చేశారంటే... ఈ స్టయిల్‌కు నెటిజన్లు ఎంతగా ఫిదా అయిపోయారో వేరే చెప్పక్కర్లేదు. ఈ మల్టీకలర్‌ ఫ్యాషన్‌ కొత్తదేం కాకపోయినా... ఇప్పుడిప్పుడే ‘స్టార్‌’ ఎట్రాక్షన్‌గా మారుతోంది.


రొనాల్డోనే కాదు... మన బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలకూ అది ఫేవరెట్‌ డ్రెస్సే! రంగుల్లో పెద్ద పెద్ద ప్యాచ్‌లు... నిలువు గీతలు... అడ్డు గీతలు... గళ్లు... గోళాలు... ఇలా అన్నీ డిజైన్‌గా డ్రెస్‌లపై మెరిసిపోతున్నాయి. చూశారుగా... మల్టీకలర్‌ టాప్స్‌లో అందాల తారలు అలియా భట్‌, రాశీఖన్నా, ఎలా మెరిసిపోతున్నారో! వీలైతే ఏదైనా అకేషన్‌కు మీరూ ట్రై చేయండి. 


Advertisement
Advertisement
Advertisement