ముల్తానీ మెరుపులు!

ABN , First Publish Date - 2020-02-19T05:44:02+05:30 IST

ముల్తానీ మట్ట్టిని ఫేస్‌ప్యాక్‌గా వేసుకుంటే ముఖం మీది జిడ్డు, మలినాలు పోతాయి. ఈ మట్టిలో పండ్ల గుజ్జు, తేనె, కలబంద కలిపి ఇంటివద్దనే ముఖ కాంతిని...

ముల్తానీ మెరుపులు!

ముల్తానీ మట్ట్టిని ఫేస్‌ప్యాక్‌గా వేసుకుంటే ముఖం మీది జిడ్డు, మలినాలు పోతాయి. ఈ మట్టిలో పండ్ల గుజ్జు, తేనె, కలబంద కలిపి ఇంటివద్దనే ముఖ కాంతిని పెంచుకోవచ్చు అంటున్నారు ప్రసిద్ధ మేకప్‌ నిపుణులు షహనాజ్‌ హుస్సేన్‌. అదెలాగో చూద్దాం...



జిడ్డు చర్మం: ముల్తానీ మట్టిలో రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. ఈ పేస్ట్‌ కళ్లు, పెదవులకు అంటకుండా జాగ్రత్తపడాలి. ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే జిడ్డు వదిలి చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.


మొటిమలు, మచ్చలు: కొందరిలో మొటిమలు, మచ్చలు తరచుగా ఏర్పడుతుంటాయి. అలాంటి వారుగంధం పొడి, రోజ్‌వాటర్‌, వేప ఆకుల పొడిని ముల్తానీ మట్టిలో వేసి మెత్తని మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలాచేస్తే మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుంది.  


బ్లాక్‌హెడ్స్‌ వదిలేందుకు: ముఖం మీద బ్లాక్‌హెడ్స్‌ అందాన్ని తగ్గిస్తాయి. ఇవి తగ్గాలంటే టేబుల్‌ స్పూన్‌ ముల్తానీ మట్టిలో బేకింగ్‌ సోడా, చార్‌కోల్‌, కొద్దిగా రోజ్‌వాటర్‌ లేదా మినరల్‌ వాటర్‌ వేసి కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తే బ్లాక్‌హెడ్స్‌ తగ్గిపోతాయి.


Updated Date - 2020-02-19T05:44:02+05:30 IST