ముల్కనూర్‌ బ్యాంకు అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2020-07-01T11:37:22+05:30 IST

ముల్కనూర్‌ సహకార బ్యాంకు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు.

ముల్కనూర్‌ బ్యాంకు అభివృద్ధికి కృషి

అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి


భీమదేవరపల్లి, జూన్‌ 30: ముల్కనూర్‌ సహకార బ్యాంకు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. బ్యాంకు అధ్యక్షుడిగా ప్రవీణ్‌రెడ్డి మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన డైరెక్టర్లు మార్పాటి జయపాల్‌రెడ్డి, కూన కనకయ్య, కడారి ఆదాం, కంకల భాగ్యతో ఎన్నికల అధికారి నీరజ ప్రమాణస్వీకారం చేయించారు. బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ మార్పాటి రాంరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు వంగ రవి, రైతులు పాల్గొన్నారు. కాగా ముల్కనూర్‌ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా రాములును ఎన్నుకున్నారు. ఆయనకు ప్రవీణ్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-07-01T11:37:22+05:30 IST