పట్టుగూళ్ల కొనుగోలుకు ముందుకు రాని రీలర్లు

ABN , First Publish Date - 2020-11-29T05:39:23+05:30 IST

రాష్ట్రప్రభుత్వం రీలర్లకు ప్రతినెలా ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌ 8నెలల నుంచి చెల్లించకపోవడంతో శనివారం మదనపల్లె పట్టు రీలర్లు గూళ్లు కొనుగోలు చేయకుండా నిరసన తెలిపారు.

పట్టుగూళ్ల కొనుగోలుకు ముందుకు రాని రీలర్లు

మదనపల్లె టౌన్‌, నవంబరు 28: రాష్ట్రప్రభుత్వం రీలర్లకు ప్రతినెలా ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌ 8నెలల నుంచి చెల్లించకపోవడంతో శనివారం మదనపల్లె పట్టు రీలర్లు గూళ్లు కొనుగోలు చేయకుండా నిరసన తెలిపారు. ఈ విషయమై రీలర్లు పలుమార్లు ప్రభుత్వానికి వినతులు అందజేసినా స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రీలర్లు ఈనెల 26వ తేది నుంచి పట్టుగూళ్లు కొనుగోలు చేయమని నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో మదనపల్లె పట్టుగూళ్ల మార్కెట్‌కు గురు,శుక్రవారాల్లో వర్షం కారణంగా రైతులు పట్టుగూళ్లను విక్రయానికి తీసుకురాలేదు. శనివారం పలు ప్రాంతాల నుంచి 700 కిలోల పట్టుగూళ్లను విక్రయానికి తీసుకొచ్చారు. కానీ రీలర్లు కొనుగోలుకు ముందుకురాకపోవడంతో విక్రయాలు నిలిచిపోయాయి. ఈవిషయాన్ని అధికారులు పట్టుపరిశ్రమశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు.

Updated Date - 2020-11-29T05:39:23+05:30 IST