నాకు కల్పించిన భద్రతను వెనక్కి తీసుకోండి: కేంద్రానికి ముకుల్ రాయ్ లేఖ

ABN , First Publish Date - 2021-06-12T21:46:22+05:30 IST

టీఎంసీలో చేరిన బీజేపీ కీలక నేత ముకుల్ రాయ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కేంద్ర తనకు కల్పించిన

నాకు కల్పించిన భద్రతను వెనక్కి తీసుకోండి: కేంద్రానికి ముకుల్ రాయ్ లేఖ

కోల్‌కతా: టీఎంసీలో చేరిన బీజేపీ కీలక నేత ముకుల్ రాయ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కేంద్రం తనకు కల్పించిన భద్రతను వెనక్కి తీసుకోవాలని అందులో కోరారు. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఆయనకు ఉన్న ‘వై ప్లస్’ కేటగిరీ భద్రతను ‘జడ్’ కేటగిరీగా మార్చింది. ఇప్పుడా భద్రతను ఉపసంహరించుకోవాలని కేంద్రానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కుమారుడు శుభ్రాంస్ రాయ్‌తో కలిసి ముకుల్ రాయ్ నిన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.


మరోవైపు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ గెలుపుపై ధీమాతో టీఎంసీని వీడి కమలం తీర్థం పుచ్చుకున్న వారిలో చాలామంది తిరిగి సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు పెద్ద ఎత్తున వార్తల వినిపిస్తున్నాయి. మొత్తం 35 మంది బీజేపీ నేతలు టీఎంసీ వైపు చూస్తున్నారని, వీరిలో 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీలోకి తిరిగి ఆహ్వానించే విషయంలో ఆచూతూచి వ్యవహరించాలని మమత యోచిస్తున్నారు. కాగా, ముకుల్ రాయ్ లేఖపై హోం మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు.

Updated Date - 2021-06-12T21:46:22+05:30 IST