మళ్లీ ముకేశే నెం.1

ABN , First Publish Date - 2020-10-09T08:13:03+05:30 IST

ఫోర్బ్స్‌ భార త టాప్‌-100 ధనికుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈ లిస్ట్‌లో ఆయన అగ్రస్థానంలో కొనసాగడం వరుసగా ఇది 13వ ఏడాది...

మళ్లీ ముకేశే నెం.1

  • ‘ఫోర్బ్స్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2020’ విడుదల
  • వరుసగా 13వ సారీ అంబానీదే అగ్రస్థానం 

ముంబై: ఫోర్బ్స్‌ భార త టాప్‌-100 ధనికుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈ లిస్ట్‌లో ఆయన అగ్రస్థానంలో కొనసాగడం వరుసగా ఇది 13వ ఏడాది. గడిచిన ఏడాదికాలంలో అంబానీ ఆస్తి 3,730 కోట్ల డాలర్లు (73 శాతం) పెరిగి 8,870 కోట్ల డాలర్లకు చేరుకుంది. మౌలిక రంగానికి చెందిన అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ రెండో స్థానంలో నిలిచారు. ఆయన వ్యక్తిగత సంపద 2,520 కోట్ల డాలర్లుగా నమోదైంది. మూడో స్థానంలో ఉన్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రమోటర్‌ శివ్‌నాడార్‌ ఆస్తి 2,040 కోట్ల డాలర్లు. డీమార్ట్‌ సూపర్‌ మార్కెట్ల అధిపతి రాధాకిషన్‌ దమానీ, హిందూజా సోదరులు, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌  చైర్మన్‌ సైరస్‌ పూనావాలా, షాపూర్‌ పల్లోంజీ మిస్త్రీ, ఉదయ్‌ కోటక్‌, ఆదీ గోద్రేజ్‌, స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ టాప్‌టెన్‌లో నిలిచారు. 




టాప్‌-100 శ్రీమంతుల సంపదలో 14శాతం వృద్ధి 

కరోనా సంక్షోభంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు రెండంకెల రుణాత్మక స్థా యికి పడిపోవచ్చన్న అంచనాలున్నాయి. అయినప్పటికీ ఫోర్బ్స్‌ టాప్‌-100 శ్రీమంతుల జాబితాలోని సగం మంది ఆస్తి పెరగడం గమనార్హం. ఈ వంద మంది మొ త్తం సంపద ఏడాదిలో 14 శాతం పెరిగి 51,750 కోట్ల డాలర్లకు చేరుకుంది. గత ఏడాది జాబితా ప్రకారం టాప్‌-100 ధనికుల మొత్తం సంపద 42,892 కోట్ల డాలర్లుగా నమోదైంది. 





ధనిక మహిళ సావిత్రి జిందాల్‌ 

సావిత్రి జిందాల్‌ 660 కోట్ల డాలర్ల వ్యక్తిగత సంపదతో భారత్‌లో అత్యంత ధనిక మహిళ గౌరవం దక్కించుకున్నారు. బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌షా (460 కోట్ల డాలర్లు), హావెల్స్‌ ప్రమోటర్లలో ఒకరైన వినోద్‌ రాయ్‌ గుప్తా (355 కోట్ల డాలర్లు), యూఎ్‌సవీ చైర్‌పర్సన్‌ లీనా తివారీ (300 కోట్ల డాలర్లు), టాఫే సారథి మల్లికా శ్రీనివాసన్‌ (245 కోట్ల డాలర్లు) టాప్‌-5 మహిళల్లో ఉన్నారు. 






ముఖ్యాంశాలు

93.28శాతం - ఏడాదికాలంలో బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌షా సంపద పెరుగుదల. ఈసారి జాబితాలో అత్యధిక ఆస్తి వృద్ధి ఆమెదే. 

43.67శాతం - బ్రిటానియా ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ నుస్లీ వాడియా ఆస్తిలో తరుగుదల. ఈసారి లిస్ట్‌లో  అధిక సంపద క్షీణత రేటు ఇదే.  

360 కోట్ల డాలర్లు - షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ అధిపతి పల్లోంజీ మిస్త్రీ కోల్పోయిన సంపద. విలువ పరంగా ఇదే అతిపెద్ద తరుగుదల.

3,730 కోట్ల డాలర్లు - ముకేశ్‌ అంబానీ ఆస్తి పెరుగుదల. 

8,862 కోట్ల డాలర్లు - టాప్‌ 100 ధనికుల మొత్తం సంపద వృద్ధి. 

6,350 కోట్ల డాలర్లు -  రిచ్‌ లిస్ట్‌లో నెం.1, నెం.2 స్థానాల్లో ఉన్న ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీల సంపద మధ్య వ్యత్యాసం.




Updated Date - 2020-10-09T08:13:03+05:30 IST