మహమ్మద్ అలీ బతికుంటే నిరసనలను ఖండించేవారు: మాజీ భార్య

ABN , First Publish Date - 2020-06-02T23:33:01+05:30 IST

బాక్సింగ్ ఛాంపియన్ మహమ్మద్ అలీ బతికుంటే అమెరికాలో నెలకొన్న పరిస్థితులను

మహమ్మద్ అలీ బతికుంటే నిరసనలను ఖండించేవారు: మాజీ భార్య

వాషింగ్టన్: బాక్సింగ్ ఛాంపియన్ మహమ్మద్ అలీ బతికుంటే అమెరికాలో నెలకొన్న పరిస్థితులను ఖండించేవారని మాజీ భార్య ఖాలీలా అలీ అన్నారు. శ్వేత పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫాయిడ్  ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మరణం తరువాత అమెరికాలో నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ఆందోళన కారులు శ్వేతసౌధాన్ని కూడా చుట్టుముట్టడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా బంకర్‌లో తలదాచుకున్నారంటే దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారికి మహమ్మద్ అలీ తప్పకుండా మద్దతు పలికేవారని.. నిరసనల పేరిట బిల్డింగ్‌లను ధ్వంసం చేస్తున్న.. కారులను దహనం చేస్తున్న వారిని మాత్రం కచ్చితంగా వ్యతిరేకించేవారని ఖలీల్ తెలిపారు. నిరసనల పేరిట వీధుల్లోకి వచ్చి ప్రజలను బాధపెట్టడం, వ్యాపారాలను తగలబెట్టడం మహమ్మద్ అలీకి నచ్చదని ఖలీల్ పేర్కొన్నారు. నిజంగా నిజాయితీతో, శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న వారు తమ నిరసనలను కొనసాగించాలని ఖలీల్ అన్నారు. కాగా..  ఆఫ్రికన్ అమెరికన్ అయిన మహమ్మద్ అలీ బాక్సింగ్‌లో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.  వియత్నాం యుద్దం సమయంలో బాక్సింగ్ చేయకూడదని మహమ్మద్ అలీ నిర్ణయం తీసుకుని తన బాక్సింగ్ టైటిల్‌ను కూడా వదులుకున్నారు.

Updated Date - 2020-06-02T23:33:01+05:30 IST