రైలు ప్రమాదం నుంచి ఆ కార్మికుడు ఎలా తప్పించుకున్నాడంటే...

ABN , First Publish Date - 2021-03-02T13:51:05+05:30 IST

యూపీలోని పీడీయూ నగర్(ముగల్ సరాయ్) యార్డ్‌లో...

రైలు ప్రమాదం నుంచి ఆ కార్మికుడు ఎలా తప్పించుకున్నాడంటే...

ముగల్‌సరాయ్: యూపీలోని పీడీయూ నగర్(ముగల్ సరాయ్) యార్డ్‌లో ఒక రైల్వే కార్మికునిపై నుంచి రైలు అతి వేగంగా వెళ్లిపోయింది. డ్యూటీ నుంచి ఇంటికి వెళుతున్న రైల్వే కార్మికుడు ధర్మేంద్రకు వెనుకగా వేగంగా రైలు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అతను పట్టాల మద్య పడుకున్నాడు. రైలు అతని మీదుగా వెళ్లిపోయింది. అయితే పట్టాల మధ్య పడుకున్న కారణంగా అతను ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. 


వివరాల్లోకి వెళితే రైల్వే ఇంజినీరింగ్ విభాగంలోని పీడబ్ల్యుఐలో పనిచేస్తున్న ధర్మేంద్ర(32) విధులు ముగించుకుని సాయంత్రం పట్టాల మీదుగా నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నాడు. ఇంతలో అతని వెనుకగా అత్యంత వేగంగా లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. వెంటనే గమనించిన ధర్మేంద్ర పట్టాలపై పడుకుండిపోయాడు. దీనిని చూసినవారంతా నిర్ఘాంతపోయారు. రైలు అతనిపై నుంచి వేగంగా వెళ్లిపోయింది. పట్టాల మధ్య నుంచి ధర్మేంద్ర లేవడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో ధర్మేంద్ర ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 

Updated Date - 2021-03-02T13:51:05+05:30 IST