ముగ్గుల పోటీలు.. సంప్రదాయాలకు ప్రతిబింబాలు

ABN , First Publish Date - 2022-01-19T06:23:02+05:30 IST

ముగ్గుల పోటీలు తెలుగు వారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

ముగ్గుల పోటీలు.. సంప్రదాయాలకు ప్రతిబింబాలు
ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేస్తున్న అయ్యన్నపాత్రుడు, టీడీపీ నాయకులు

మాజీ మంత్రి  అళీ్యున్నపాత్రుడు


నాతవరం, జనవరి 18: ముగ్గుల పోటీలు తెలుగు వారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండలంలోని జిల్లేడిపూడిలో రాములవారి తీర్థ మహోత్సవాలను పురస్కరించుకుని మండలస్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో గంగిరెద్దులు, హరిదాసులు తోడపెద్దుల సందడి తగ్గిపోతున్నదని, ఇటువంటి తరుణంలో తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవడానికి ముగ్గులు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ఇందిరావతి, లావణ్య, అనీషలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, సర్పంచ్‌ లాలం వెంకటరమణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T06:23:02+05:30 IST