Abn logo
Sep 21 2021 @ 11:31AM

సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ

అమరావతి: సినిమా టిక్కెట్లను ఆన్ లైన్‌లో విక్రయించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మాజీ మంత్రి, కాపు నేత, ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఏపీ సీఎం జగన్‌కు ఈ మేరకు ఒక లేఖ రాశారు. ఆన్ లైన్‌లో టిక్కెట్లు అమ్మి ఇండస్ట్రీని ఆదుకున్నట్లే, సినిమా కోసం పనిచేసే నటీ నటులు మొదలుకొని ఆఖరి వ్యక్తి వరకు వారికిచ్చే రెమ్యునరేషన్లు, ఇతర ఖర్చులను నిర్మాత నుంచి మొత్తం డబ్బంతా ప్రభుత్వమే జమ చేయించుకోవాలన్నారు. ఆన్ లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా ప్రభుత్వమే సినీ నటుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తే బాగుంటుందన్నారు. దీనివల్ల దుబారా, ఎగవేతలు ఉండవని సూచించారు. ఎక్కడా తెలుపు, నలుపు, ధనం పదాలు వినిపించవన్నారు. పూర్తిగా వైట్ మణితోనే వ్యాపారం జరుగుతుందని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption