మట్టి గణపతి!

ABN , First Publish Date - 2020-08-22T06:17:14+05:30 IST

పాత్రలోకి మట్టి తీసుకోవాలి. కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ మట్టిని మెత్తగా చేసుకోవాలి.

మట్టి గణపతి!

కావలసినవి

  1.  మట్టి  ప్లాస్టిక్‌ పాత్ర 
  2.  చిన్న పూసలు 
  3.  కొన్ని పూలు 

తయారీ

  1.  పాత్రలోకి మట్టి తీసుకోవాలి. కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ మట్టిని మెత్తగా చేసుకోవాలి.
  2.  అందులో కాస్త మట్టిని తీసుకొని రెండు బంతుల్లా చేయాలి. ఒకటి కాస్త పెద్దగా, మరొకటి కొద్దిగా చిన్నగా ఉండేలా చేయాలి.
  3.  చిన్న ఉండను తల మాదరిగా ఒత్తుకోవాలి. పెద్ద ఉండను పొట్ట భాగంగా చేసుకోవాలి. 
  4.  ఇప్పుడు ఇంకాస్త మట్టిని తీసుకొని నాలుగు చిన్న ఉండలుగా చేయాలి. వాటిని కాస్త పొడవుగా చేసుకోవాలి. ఇందులో రెండింటితో చేతులను, మరో రెండింటితో కాళ్లను తయారు చేసి పొట్ట భాగంలో అతికించాలి. తరువాత తొండం, చెవులు తయారుచేసుకుని అతికించాలి.
  5.  చివరగా రెండు చిన్న బంతులు తయారుచేసి దంతాలుగా అమర్చాలి. 
  6.  ఇప్పుడు పూసలను కళ్లుగా అతికించాలి. పూలు పెట్టాలి. అంతే.. మట్టి గణపతి రెడీ. 

Updated Date - 2020-08-22T06:17:14+05:30 IST