న్యూఢిల్లీ: ఎట్టకేలకు రుతుపవనాలు ఢిల్లీని తాకాయి. ఉరుములతో కూడిన భారీ వర్షాలు సిటీలోని పలు ప్రాంతాల్లో మంగళవారంనాడు చోటుచేసుకుట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ''ఎట్టకేలకు వర్షాలు కురిసాయి. రెండు మూడు రోజులుగా వర్ష సూచనలు ఉన్నప్పటికీ రుతుపవనాల ప్రారంభం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. గత రెండ్రోజులుగా ఢిల్లీ మినహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి'' అని భారత వాతావరణ శాఖ అధికారి మాధవన్ రాజీవన్ ట్వీట్ చేశారు. సిటీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ ఉదయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని తెలిపింది. సహజంగా రుతుపవనాలు జూన్ 27 ప్రాంతంలో ఢిల్లీని తాకుతుంటాయి.