ఎంఎస్‌ సుబ్బులక్ష్మి 105వ జయంతి

ABN , First Publish Date - 2021-09-17T05:36:35+05:30 IST

సంగీత విద్వాంసురాలు ఎంఎస్‌ సుబ్బులక్ష్మి గొంతు విశ్వం ఉన్నంత వరకు మార్మోగుతూనే ఉంటుందని శ్రీరామ సంగీత అకాడమీ ని ర్వాహకులు కురిశెట్టి లక్ష్మీనాగమణి, కొత్త విజయలక్ష్మి, నాచు శ్రీవల్లి అన్నారు.

ఎంఎస్‌ సుబ్బులక్ష్మి 105వ జయంతి
సంగీత విద్వాంసులను సత్కరించిన దృశ్యం

భీమవరం అర్బన్‌, సెప్టెంబరు 16 : సంగీత విద్వాంసురాలు ఎంఎస్‌ సుబ్బులక్ష్మి గొంతు విశ్వం ఉన్నంత వరకు మార్మోగుతూనే ఉంటుందని శ్రీరామ సంగీత అకాడమీ ని ర్వాహకులు కురిశెట్టి లక్ష్మీనాగమణి, కొత్త విజయలక్ష్మి, నాచు శ్రీవల్లి అన్నారు. కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ భవనంలో త్యాగరాజ భక్తసభ ఆధ్వర్యంలో ఎంఎస్‌ సుబ్బులక్ష్మి 105వ జయంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు సంగీత విద్యాంసురాలను సత్కరించారు. త్యాగరాజ భక్త సభ సభ్యు లు చెరుకువాడ వెంకట్రామయ్య రంగసాయి మాట్లాడుతూ భారతరత్న పురస్కారాన్ని పొందిన మెట్టమొదటి సంగీత కళాకారాణి అన్నారు. అనంతరం సంగీత విద్వాంసురాలు లక్ష్మీనాగమణి, విజయలక్ష్మి, పి.శైలజలను ఘనంగా సత్కరించారు. శిక్షకులు హేమ, కొండ్రు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T05:36:35+05:30 IST