Abn logo
Jan 16 2021 @ 11:55AM

నిర్మాత హర్ట్.. తప్పు సరిదిద్దుకున్న నమ్రత!

సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్ రాజును హర్ట్ చేసింది. దీంతో రాజు ట్విటర్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మహేష్‌ నటించిన `ఒక్కడు` చిత్రం విడుదలై 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నమత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. మహేష్ సినిమాల్లో `ఒక్కడు` క్లాసిక్ అని, తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని పేర్కొన్నారు. 


ఆ సినిమాకు పని చేసిన అందరి పేర్లనూ తన పోస్ట్‌లో ప్రస్తావించారు. అయితే నిర్మాత ఎమ్‌ఎస్ రాజు పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో హర్ట్ అయిన ఎమ్‌ఎస్ రాజు.. `పొరపాట్లు జరుగుతుంటాయి బాబు.. `ఒక్కడు` గురించి మాట్లాడుతూ నమ్రతగారు నా పేరును మర్చిపోయారు. అయితే `ఒక్కడు` సినిమా ఆమెకు ఫేవరెట్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. గుడ్‌లక్‌` అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నమత్ర తన పోస్ట్‌లో ఎమ్‌ఎస్ రాజు పేరును చేర్చారు. 
Advertisement
Advertisement
Advertisement