MS Dhoni Birthday : 41వ వసంతంలోకి ఎంఎస్ ధోనీ.. రిటైరయినా తరగని క్రేజ్.. ఘనతలేంటో ఓ లుక్కేయండి..

ABN , First Publish Date - 2022-07-07T22:17:58+05:30 IST

క్రికెటర్లు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియా నుంచి మీడియా వరకు అంతా ఆకాశానికి ఎత్తేస్తాయి.

MS Dhoni Birthday : 41వ వసంతంలోకి ఎంఎస్ ధోనీ.. రిటైరయినా తరగని క్రేజ్.. ఘనతలేంటో ఓ లుక్కేయండి..

ఇంటర్నెట్ డెస్క్ : క్రికెటర్లు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియా నుంచి మీడియా వరకు అందరూ ఆకాశానికి ఎత్తేస్తారు. అయితే రిటైర్మెంట్ ప్రకటించాక క్రికెటర్ల ఆదరణ అంతంత మాత్రమేనని చెప్పాలి. కానీ ఒక క్రికెటర్‌ రెండేళ్లక్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పినా అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతలా క్రికెట్ ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయిన ఆ ఆటగాడే ‘మహేంద్ర సింగ్ ధోనీ’(Mahendra singh Dhoni). అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో చెరగని ముద్రవేసుకున్న ధోని.. గురువారం 41వ వసంతంలోకి అడుగుపెట్టాడు. మాజీల నుంచి అభిమానుల వరకు అందరూ పుట్టినరోజు(Birth day) శుభాకాంక్షాలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా ధోనీ కెరీర్‌లోని కొన్ని విశేషాలను గుర్తుచేసుకుందాం..


జులై 7, 1981న బిహార్‌లోని రాంచీ(ప్రస్తుతం జార్ఖండ్)లో ధోని పుట్టాడు(Birth). రాంచీ నుంచి ప్రస్థానం ప్రారంభించిన మహేంద్ర సింగ్ ధోనీ క్రమంగా టీమిండియా కెప్టెన్‌గా ఎదిగి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా కనిపించే ధోనీ ‘మిస్టర్ కూల్’గా, ‘MSD’గా పేరొందాడు. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో.. సిక్సర్ కొట్టి భారత్‌కు వరల్డ్ కప్ అందించిన క్షణాలు భారత క్రికెట్ అభిమానాల కళ్లముందు కదులుతూనే ఉంటాయి.


ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్..

టెస్టులు - 90

వన్డేలు - 350

టీ20లు- 98

మొత్తం పరుగులు 17,266

క్యాచ్‌లు - 634

స్టంపింగ్స్ - 195

- 2007 -16 మధ్య వన్డే టీమ్‌కి కెప్టెన్‌గా నాయకత్వం

- అన్నీ ఐసీసీ ట్రోపీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా గుర్తింపు.

- 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై


అవార్డులు..

- 2008, 2009లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డులు.

- 2007లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న.

- 2009లో పద్మ శ్రీ

- 2018లో పద్మభూషణ్


ధోనీ కెప్టెన్‌గా ఇండియా సాధించిన గొప్ప విజయాలు..

- 2007 టీ20 వరల్డ్ కప్.

- 2011 వన్డే వరల్డ్ కప్.

- 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ.

- 2009లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో ఇండియా నంబర్ 1.


ఐపీఎల్‌లో తిరుగులేని కెప్టెన్..

అంతర్జాతీయ మ్యాచ్‌ల ద్వారా ధోని ఎంతటి కీర్తి గడించాడో.. అంతేస్థాయిలో ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లోనూ ప్రత్యేకతను చాటుకున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్(CSK) కెప్టెన్‌గా వ్యవహరించి.. 2010, 2011, 2018, 2021 టైటిల్స్‌ని గెలిపించాడు.

Updated Date - 2022-07-07T22:17:58+05:30 IST