వచ్చే రెండేళ్లలో ధోనీకి మరో అవకాశం వస్తుంది: ఆసీస్ మాజీ స్పిన్నర్

ABN , First Publish Date - 2020-03-29T21:11:13+05:30 IST

2019 క్రికెట్ ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ ఆడిన ఏ

వచ్చే రెండేళ్లలో ధోనీకి మరో అవకాశం వస్తుంది: ఆసీస్ మాజీ స్పిన్నర్

2019 క్రికెట్ ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ ఆడిన ఏ సిరీస్‌లోనూ అతనికి జట్టులో చోటు దక్కలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో అభిమానించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగుపెడతాడని అంతా భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ కాస్త వాయిదా పడింది. ఈ ఏడాది అసలు జరుగుతుందా.. లేదా.. అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. దీంతో ఇక మిగిలింది ధోనీ రిటైర్‌మెంటే అని అతని అభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు.


అయితే ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ మాత్రం రానున్న రెండు సంవత్సరాల్లో ధోనీ ఇండియా తరఫున ఆడేందుకు మరో అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు. 


‘‘ఒకవేళ ఐపీఎల్ 2020 రద్దైతే.. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని మీరు అనుకుంటున్నారా?’’ అని ఓ అభిమాని బ్రాడ్ హాగ్‌ను ప్రశ్నించాడు. 


‘‘అవి ఊహాగానాలు మాత్రమే. అతను రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని అని అనుకోవడం లేదు. భవిష్యత్తులో ఎటువంటి అడుగులు వేయాలో చాలా ప్రశాంతంగా ధోనీ ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉంటాడు. వచ్చే రెండు సంవత్సరాల్లో ధోనీకి మరో అవకాశం లభిస్తుందని నాకు అనిపిస్తుంది. అతని కెరీర్ చాలా సరదాగా సాగింది. అతను చేసిన వాటిని చూసి సంతోషిద్దాము’’అంటూ హాగ్ సమాధానం ఇచ్చారు. 

Updated Date - 2020-03-29T21:11:13+05:30 IST