Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 01 Apr 2022 16:42:56 IST

తొలి బంతినే సిక్స్ కొట్టి ఒక రికార్డు.. చివరి బంతిని ఫోర్ కొట్టి మరో రికార్డు

twitter-iconwatsapp-iconfb-icon
తొలి బంతినే సిక్స్ కొట్టి ఒక రికార్డు.. చివరి బంతిని ఫోర్ కొట్టి మరో రికార్డు

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఒకే ఒక్క సిక్సర్‌ కొట్టి ఒక రికార్డు, ఫోర్ కొట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన ధోనీ.. ఆర్సీబీ మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్ రెండో బంతికి అవేష్ ఖాన్ బౌలింగులో శివమ్ దూబే (49) అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ధోనీ.. ఎదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్‌లోకి తరలించాడు. 


ఈ సిక్సర్‌తో ధోనీ 19వ ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన డివిలియర్స్ సరసన చేరాడు. ఐపీఎల్‌లో 19వ ఓవర్‌లో డివిలియర్స్, ధోనీ ఇద్దరూ ఇప్పుడు 36 సిక్సర్లతో సమానంగా ఉన్నారు. ఏబీడీ ఇప్పటికే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో ధోనీ మరొక్క సిక్సర్‌ కొడితే అతడి రికార్డు బద్దలైపోతుంది. ధోనీ, ఏబీడీ తర్వాతి స్థానాల్లో ఆండ్రూ రసెల్ (26), కీరన్ పొలార్డ్ (24), హార్దిక్ పాండ్యా (24) ఉన్నారు. 


ఇక, ఈ మ్యాచ్‌లో చివరి బంతిని ఫోర్ కొట్టడం ద్వారా ధోనీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో 7వేల పరుగులు పూర్తిచేసుకున్న తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా, ఆరో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ధోనీ కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప ఉన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.