Abn logo
Sep 29 2020 @ 16:42PM

రూ.3 లక్షలు ఒప్పదం కుదుర్చుకున్న భార్య ఏం చేసిందంటే..

కర్నూలు: జిల్లాలోని కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సుఫారి గ్యాంగ్‌తో భర్త గంగయ్యను భార్య దుర్గమ్మ హత్య చేయించింది. సుఫారి గ్యాంగ్‌తో ఆమె రూ.3లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.లక్ష అడ్వాన్స్ కూడా ఇచ్చేంచింది. గంగయ్యను హత్య చేసిన కిరాయి హంతకులు నల్లమలలో అడవుల్లో మృతదేహాన్ని పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement