మిసెస్ శ్రీలంక పోటీలో గందరగోళం... కిరీటాన్ని లాక్కున్న మిసెస్ వరల్డ్

ABN , First Publish Date - 2021-04-07T16:59:15+05:30 IST

శ్రీలంకలో నిర్వహించిన మిసెస్ శ్రీలంక పోటీల్లో గందరగోళం నెలకొంది.

మిసెస్ శ్రీలంక పోటీలో గందరగోళం... కిరీటాన్ని లాక్కున్న మిసెస్ వరల్డ్

కొలంబో: శ్రీలంకలో నిర్వహించిన మిసెస్ శ్రీలంక పోటీల్లో గందరగోళం నెలకొంది. ఈ అందాల రాణుల ఎంపిక పోటీలో విజేతగా నిలిచిన పుష్పికా డి సిల్వా తలపై ఉంచిన కిరీటాన్ని ప్రస్తుత మిసెస్ వరల్డ్ కరోలిన్ జ్యూరీ... స్టేజీపైననే లాక్కున్నారు.  ఈ సందర్భంగా కరోలిన్ మాట్లాడుతూ... ఆమెకు ఈ కిరీటాన్ని తలపై పెట్టుకునేందుకు అర్హత లేదని, దానికి ఆమె విడాకులు తీసుకోవడమేకారణమని ఆరోపించారు. అయితే ఈ కిరీటాన్ని తలపై నుంచి గట్టిగా లాగిన కారణంగా పుష్పిక తలకు గాయమయ్యింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే కొలంబోలోని ఒక థియేటర్‌లో జరిగిన మిసెస్ శ్రీలంక అందాల పోటీని ఒక టీవీ ఛానల్ ప్రసారం చేసింది. 


కార్యక్రమ నిర్వహకులు... మిసెస్ డిసెల్వా... భర్తతో విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కరోలిన్ జ్యూరీ... పెళ్లయి విడాకులు తీసుకున్న మహిళలు ఈ పోటీకి అనర్హులని నిర్వాహకులు చెప్పారని, అందుకే ఈ కిరీటాన్ని రెండవ స్థానంలో నిలిచిన మహిళకు ఇవ్వాలని కోరారు. తరువాత కరోలిన్... డిసిల్వా తలపై ఉన్న కిరీటాన్ని గట్టిగా లాగారు. దీంతో ఆమె తలకు గాయమైంది.  దీంతో డి సిల్వా అవమానంతో స్టేజీపై నుంచి కిందకు దిగిపోయారు. వెంటనే తేరుకున్న పోటీ నిర్వాహకులు డి సిల్వాను క్షమాపణలు కోరుతూ, ఆమె కిరీటాన్ని తిరిగి ఇచ్చేశారు. కాగా దీనికిమందు డి సిల్వా 2011లో మిస్ శ్రీలంక కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ విషయాన్ని డిసిల్వా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో తెలియజేస్తూ, ఇది తనకు జరిగిన ఘోర అవమానమని పేర్కొన్నారు. దీనిపై న్యాయ విచారణ చేయాలని ఆమె కోరారు. తాను భర్త నుంచి విడిగా ఉంటున్నానని, విడాకులు తీసుకోలేదని వివరించారు. 

Updated Date - 2021-04-07T16:59:15+05:30 IST