కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణకు మందకృష్ణ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

ABN , First Publish Date - 2021-07-15T00:51:06+05:30 IST

కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణకు మందకృష్ణ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణకు మందకృష్ణ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే కత్తి మహేష్ మరణంపై అనుమానాలున్నాయంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. కత్తి మహేష్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే తాజాగా వైసీపీ నేతల తీరుపై ఆయన విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్‌గా మారింది. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ తీరును కూడా మందకృష్ణ ఎండగట్టారు.


కత్తి మహేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ, జగన్ కోసం ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తి చనిపోతే సీఎం జగన్ కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని మందకృష్ణ విమర్శించారు. మహేష్ భౌతిక కాయానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహా ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా నివాళులర్పించకపోవడం అన్యాయమని దుయ్యబట్టారు. దళితులంటే ఇంకా చులకన భావమే ఉందని, గౌరవం, గుర్తింపు ఇవ్వబోరని మరోసారి అర్థమైందని మందకృష్ణ అన్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘కత్తి మహేష్ మృతి వివాదాస్పదం ఎందుకవుతోంది?. రోడ్డు ప్రమాదంపై అనుమానాలకు కారణాలేంటి?. కత్తి మృతిపై న్యాయ విచారణకు మందకృష్ణ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?.’’ అనే అంశాలపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ లైవ్ నిర్వహించింది. ఈ లైవ్ వీడియో చూడగలరు..



Updated Date - 2021-07-15T00:51:06+05:30 IST