చెట్ల కిందే నౌకరీలు.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2020-08-06T00:02:14+05:30 IST

విజయనగరం ఇప్పుడు కరోనా నగరంగా మారిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలన్ని కరోనా హాట్‌ స్పాట్‌లుగా మారాయి. దీంతో అటువైపు ...

చెట్ల కిందే నౌకరీలు.. ఎందుకో తెలుసా?

విజయనగరం ఇప్పుడు కరోనా నగరంగా మారిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలన్ని కరోనా హాట్‌ స్పాట్‌లుగా మారాయి. దీంతో అటువైపు తొంగిచూసే సాహసం చేయడంలేదు జనం. ఉద్యోగుల సైతం రోజువారి పనులకు హాజరయ్యేందుకు బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో చెట్ల కిందే నౌకరీలు కొనసాగిస్తున్నారు. 


ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొదట ఒక్క కేసు కూడా లేని విజయనగరం జిల్లాలో ప్రస్తుతం మహమ్మారి విలయం సృష్టిస్తోంది. రాష్ట్రంలోనే చిన్న జిల్లా అయిన విజయనగరంలో వేల కరోనా కేసులు నమోదుకావడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలోని నాలుగు పట్టణాలు మండలకేంద్రాలను దాటుకుని పల్లెల్లో విస్తరిస్తోన్న వైరస్ తో కలకలం రేగింది. ఇప్పటికే జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య నాలుగు వేలు దాటింది. 

Updated Date - 2020-08-06T00:02:14+05:30 IST