తూర్పు మండల తహసీల్దార్‌ కార్యాలయం ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-01T05:57:17+05:30 IST

పొన్నూరు రోడ్డులోని పాత మీసేవా కేంద్రంలో ఏర్పాటుచేసిన తూర్పు మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని మంగళవారం హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు.

తూర్పు మండల తహసీల్దార్‌ కార్యాలయం ప్రారంభం
తహసీల్దార్‌ కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ క్రిస్టినా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్‌ కావటి, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌ తదితరులు

గుంటూరు, నవంబరు 30: పొన్నూరు రోడ్డులోని పాత మీసేవా కేంద్రంలో ఏర్పాటుచేసిన తూర్పు మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని  మంగళవారం హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ తూర్పు తహశీల్దార్‌ కార్యాలయం ఏర్పాటుతో నగరంలోని కొన్ని ప్రాంతాలతో పాటు బుడంపాడు, ఏటుకూరు, రెడ్డిపాలెం, జొన్నలగడ్డ గ్రామాల వారికి రెవెన్యూ సేవలు త్వరితగతిన అందుతాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, జేసీ దినేష్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర క్రిస్టినా, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్‌ చైౖర్మన్‌ మండేపూడి పురుషోత్తం, డిప్యూటీ మేయర్లు డైమండ్‌బాబు, షేక్‌ సజీల,  తూర్పు మండల తహసీల్దారు శ్రీకాంత్‌,  నగర కమిషనర్‌ అనురాధ పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-01T05:57:17+05:30 IST