ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్...

ABN , First Publish Date - 2021-04-08T13:04:45+05:30 IST

ఏపీవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్...

అమరావతి : ఏపీవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు.. 7,220 ఎంపీటీసీ స్థానాలకు 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పరిషత్‌ ఎన్నికల కోసం 27,751 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీలో 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 247 పోలింగ్‌ కేంద్రాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 3,538 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 13 జిల్లాల్లో మొత్తం 2,46,71,002 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 375 స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు.

ఎన్నికలు బహిష్కరించిన తాండా గ్రామస్థులు (12:10 PM)

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామాపురం తాండా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. పంచాయతీ కేంద్రం అంశంలో తమ గ్రామానికి అన్యాయం జరిగిందంటూ పరిషత్ ఎన్నికల ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ఒకట్రెండు గ్రామాల ప్రజలు కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు.. (11:49 AM)

నెల్లూరు జిల్లా బోగోలు మండలం తెల్లగుంట గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. తాగునీటి సమస్యను పరిష్కరించలేదని అందుకే ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు గ్రామ ప్రజలు వెల్లడించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యను పరిష్కరించలేదంటూ గ్రామస్థులు కన్నెర్రజేస్తున్నారు. మూడు రోజులుగా ఖాళీ బిందెలతో  గ్రామ ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

బ్యాలెట్ బాక్స్‌ను నీళ్లతొట్టిలో పడేసిన బీజేపీ అభ్యర్థి (11:33 AM)

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం పొనుగోడులో రీ-పోలింగ్‌కు అధికారులు ఆదేశించారు. ఏకపక్షంగా పోలింగ్ జరుగుతోంద బీజేపీ ఏజెంట్ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఓ వైపు గొడవ జరుగుతుండగా.. బీజేపీ అభ్యర్థి, ఏజెంట్ ఇద్దరూ కలిసి బ్యాలెట్ బ్యాక్సును నీళ్లతొట్టిలో పడేశారు. దీంతో పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. విచారణ అనంతరం రీ- పోలింగ్‌కు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదిలావుంటే.. జిల్లాలో ఉదయం 10 గంటల సమయానికి 13.09 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు.

పెదకూరపాడులో ఘర్షణ.. (11:10 AM)

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు పోలింగు బూత్ వద్ద టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓటు వేసే విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అధికారులు, పోలీసులు అధికారపక్షానికే మద్దతుగా పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అఖిలప్రియ నిర్భందం.. (10:56 AM)

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచుపల్లిల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని కాలనీల్లో యువకులు ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మాజీమంత్రి భూమా అఖిల ఘటనాస్థలికి బయల్దేరడానికి యత్నించగా.. మార్గమధ్యలోనే ఆలయంలో పోలీసులు నిర్భందించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అఖిల మండిపడుతున్నారు.

కనీస వసతుల్లేవ్.. (10:51 AM)

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని పోలింగ్ కేంద్రం వద్ద కనీస వసతులు ఏర్పాటు చేయలేదని ఓటర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు.. కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మండుటెండలో క్యూ లైన్‌లో ఓటర్లు బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు అనుగుణంగా అధికారులు ఎక్కడా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం పోలింగ్ కేంద్రం లోపల కానీ.. బయట కానీ థర్మల్ స్కానర్‌లు, శానిటైజర్లు కనిపించలేదు. గంటల తరబడి ఎండలో నించోనివాల్సి వస్తోందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుర్తు మారిపోయింది.. (10:25 AM)

విశాఖపట్నం జిల్లాలో పలుచోట్ల ఎంపీటీసీ గుర్తు మారిపోయింది. పూర్తి వివరాల్లోకెళితే.. తన గుర్తు మారిందంటూ పెదబయలు మండలం సీతగుంట సెగ్మెంట్ ఎంపీటీసీ సీపీఐ పార్టీ అభ్యర్థి ఎంపీటీసీ అభ్యర్థి ఆందోళనకు దిగారు. కంకి కొడవలి గుర్తు రావాల్సి ఉండగా.. బ్యాలెట్ పేపర్‌లో సుత్తి కొడవలి గుర్తును ముద్రించారని.. తనకు న్యాయం చేయాలని అధికారులను ఆ అభ్యర్థి కోరారు. కాగా ఇదే పరిస్థితి ప్రకాశం జిల్లా పామూరులోనూ జరిగింది.

ఎంపీటీసీ స్థానంలో గుర్తులు తారుమారు (10:00 AM)

ప్రకాశం జిల్లాలోని పామూరు రెండో ఎంపీటీసీ స్థానంలో గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పేపర్‌లో కంకి కొడవలి గుర్తు స్థానాన్ని మార్చడంపై సీపీఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది. రీపోలింగ్ చేయాలంటూ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. అధికారులతో ప్రకాశం జిల్లా సీపీఐ కార్యదర్శి నారాయణ వాగ్వాదానికి దిగారు. వాగ్వాదానికి దిగిన నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కార్యదర్శి నారాయణ అరెస్ట్‌ను సీపీఐ రామకృష్ణ ఖండించారు.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా..  (9:48 AM)

సమయం : ఉదయం 9 గంటల వరకు

------------------

శ్రీకాకుళం : 8.99 %

విజయనగరం : 9.01% 

విశాఖపట్నం : 8.83% 

తూర్పుగోదావరి : 4.59%

పశ్చిమగోదావరి : 3.42% 

కృష్ణ జిల్లా : 9.32%

గుంటూరు : 7.52%

ప్రకాశం : 6.53%

నెల్లూరు : 6.36%

చిత్తూరు : 7.29%

వైఎస్సార్ కడప : 4.81%

కర్నూల్ : 9.58%

అనంతపురం : 9.05%

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 7.6 శాతం పోలింగ్ నమోదు.

గుంటూరు జిల్లాలో 8 జడ్పీటీసీలు ఏకగ్రీవం (9:55 AM)

గుంటూరు: జిల్లాలో మొత్తం  57 జడ్పీటీసీలు ఉండగా 54 జడ్పీటీసీలకు నోటిఫీకేషన్ ఇచ్చారు. అందులో 8 ఏకగ్రీవం అయ్యాయి.  పోటీలో ఉన్న ఒక జడ్పీటీసీ అభ్యర్థి మృతితో ఆ మండలంలో ఎన్నిక నిలిపివేశారు. మిగిలిన 45 జడ్పీటీసీ స్దానాలకు  పోలింగ్ జరుగుతోంది. అలాగే గుంటూరు జిల్లాలో మొత్తం 913 ఎంపీటీసీలు ఉండగా.. 805 ఎంపీటీసీలకు నోటీఫికేషన్ ఇచ్చారు. అందులో 226 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 579 స్దానాలకు  పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మందకొడిగా సాగుతున్న పోలింగ్.. (9:39 AM)

ఏపీలోని పలు జిల్లాల్లో మందకొండిగా పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ప్రకాశం, పశ్చిమ గోదావరి  జిల్లాల్లో మందకొడిగా పోలింగ్ సాగుతోంది. ప్రకాశంలో ఉదయం 7గంటలకు ప్రారంభమైనా.. 9 గంటల వరకూ కేవలం 6.52 శాతం పోలింగ్ నమోదయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి గంటలో కేవలం 3.42 శాతం మాత్రమే పోలింగ్ నమోదవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో 7.5 శాతం పోలింగ్ నమోదయ్యింది.

వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట (9:11 AM)

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపతాపల్లి పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. దీంతో ఇరువర్గీయులను పోలీసులు బయటకు పంపేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. ప్రశాంతంగానే పోలింగ్ ప్రక్రియ జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు.

ఏజెంట్లను గెంటేస్తున్న పోలీసులు.. (9:02 AM)

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లను పోలీసులు బయటకు పంపుతున్నారు. ఏజెంట్‌గా కూర్చుంటే కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు.. కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం నుంచి టీడీపీ ఏజెంట్‌ను గెంటివేశారు. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలోనూ టీడీపీ ఎన్నికల ఏజెంట్ వెంకటేష్‌పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు లక్ష్మీరెడ్డి, ఆదినారాయణ దాడికి దిగారు.

జనసేన నేత ఇంటిపై వైసీపీ వర్గీయుల దాడి.. (9:01 AM)

అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేన నేత మధుసూదన్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. గురువారం ఉదయం జనసేన నేత ఇంటిపై వైసీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి ఎందుకు చేశారు..? ఎన్నికల విషయంలోనే గొడవ జరిగిందా..? లేకుంటే మరే విషయంలోనైనా జనసేన నేత దాడి జరిగిందా..? అనే విషయాలు తెలియరాలేదు. కాగా.. ఇవాళ ఉదయం ఎన్నికలు ప్రారంభమైనప్పట్నుంచి ఏపీలో పలు చోట్ల వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. కొన్ని చోట్ల సొంత పార్టీ ఏజెంట్లను తప్ప మరెవ్వర్నీ పోలింగ్ కేంద్రాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం.. మరికొన్నిచోట్ల వైసీపీ వర్సెస్ టీడీపీగా పరిస్థితులు నెలకొన్నాయి. 

భారీ బందోబస్తు మధ్య పోలింగ్..(8:47 AM)

నెల్లూరు జిల్లాలో 1677 పోలింగ్ బూత్‌లల్లో ప్రశాంతంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 34 జడ్పీ స్థానాల్లో 140 మంది, 366 స్థానాల్లో 972 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. మొత్తం 305 అత్యంత సమస్యాత్మక, 379 సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఏజెంట్లే లేరు! (8:33 AM)

కర్నూలు జిల్లా పత్తికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 15/38A పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు లేక పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఏజెంట్లు వస్తేనే పోలింగ్ మొదలుపెడతామని సిబ్బంది చెబుతున్నారు. ఏజెంట్లు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటర్లు వెనుదిరుగుతున్నారు. జిల్లాలో మిగతా చోట్ల ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఇక్కడ మాత్రం 8:35 అయినా ఏజెంట్లు రాకపోవడం గమనార్హం. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు వేచి చూసి కొందరు వెనుదిరగ్గా.. మరికొంత మంది మాత్రం ఎంతసమయం అయినా సరే ఓటు హక్కు వినియోగించుకుంటామని క్యూలైన్‌లోనే ఉన్నారు.

ఈపూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ..(8:17 AM)

గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపువారిపాలెంలో వైసీపీ దౌర్జన్యానికి పాల్పడింది. టీడీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రానివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ ఏజెంట్ల నుంచి ఏజెంట్ ఫారాలు చించేసి వారిని బయటకు నెట్టేశారు. దీంతో ఇరువర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చూస్తూ మిన్నకుండిపోవడం గమనార్హం. పోలీసులు వైసీపీకి సహకరిస్తూ ఉన్నారని టీడీపీ ఏజెంట్ల, ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం జిల్లా ఉన్నతాధికారులకు చేరడంతో పరిస్థితి చక్కబడింది. ప్రస్తుతం ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతోంది. 

74 కేంద్రాల్లో 3 గంటల వరకే పోలింగ్.. (8:10 AM)

విజయనగరం జిల్లాలో 34 జడ్పీటీసీ, 549 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇప్పటికే 03 జడ్పీటీసీలు, 55 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 31 జడ్పీటీసీ,494 ఎంపీటీసీ స్థానాలకు 1879 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి జడ్పీటీసీ స్థానాలకు 129 మంది, ఎంపీటీసీ స్థానాలకు1189 మంది బరిలో ఉన్నారు. కాగా.. 74 నక్సల్స్ ప్రభావిత కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని  అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.

ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి.. (8:05 AM)

గుంటూరులో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఇవాళ ఉదయం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయారు. పీవీ పాలెం మండలం అల్లూరు జెడ్పీ హైస్కూల్‌లో విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

విశాఖలో ప్రశాంతంగా పోలింగ్.. (7:53 AM)

విశాఖ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్, మంచినీటి వసతిని అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతి లేదు. జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో రోలుగుంట ఏకగ్రీవం కాగా.. ఆనందపురం టీడీపీ అభ్యర్థి చనిపోవడంతో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగతా 37 స్థానాల్లో 174 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ విషయానికొస్తే.. జిల్లాలో మొత్తం 651 స్థానాలున్నాయి. ఇందులో 37 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మరో రెండు స్థానాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు మృతితో ఎన్నిక వాయిదా పడ్డాయి. మిగతా 612 స్థానాలకు గాను మొత్తం 1,793 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 2100 పోలింగ్ కేంద్రాలు ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. 17, 84, 678 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో 732 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

కర్నూలు జిల్లా బేతంపల్లెలో ఉద్రిక్తత (7:46 AM )

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బేతంపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రాకుండా వైసీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. టీడీపీ ఎన్నికలు బహిష్కరించింది కదా.. అలాంటప్పుడు పోలింగ్ కేంద్రంలోకి టీడీపీ ఏజెంట్లు ఎలా వస్తారు..? అని వైసీపీ ఏజెంట్లు గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయులను నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది.  ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లాలో మొత్తం 1763 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఐదు వేల మంది పోలీసులతో అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ (7:43 AM)

గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో వివాదం చోటు చేసుకోగా అది తీవ్ర ఘర్షణకు దారితీసింది.

కడపలో దౌర్జన్యకాండ..(7:39 AM)

కడప జిల్లాలో అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగారు. చాపాడు మండలం రాజువారిపేటలో టీడీపీ మద్దతుదారు ఏజెంట్‌ను కూర్చోకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో టీడీపీ మద్దతుదారు ఎంపీటీసీ అభ్యర్ధి రాజేశ్వరి పోలింగ్ బూతు వద్ద బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని రాజేశ్వరి పోలింగ్‌ను అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు రాజేశ్వరిని అరెస్ట్ స్టేషన్‌కు తరలించారు.

ఓటేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి.. (12:50 PM)

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రాజుపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓటు వేసే విషయం ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఓటేయడానికి వచ్చిన వ్యక్తిపై మరొకరు దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తలకు, చేతులకు గాయాలయ్యాయి. కొందరు యువకులు ఆయన్ను ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు.

స్లిప్‌లు లాక్కున్న వాలంటీర్‌లు.. (12:50 PM)

ప్రకాశం జిల్లా కొండెపి మండలం పెట్లూరు పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ జరిగింది. ఓటు వేయ్యడానికి వచ్చిన వ్యక్తుల వద్ద నుంచి ఓటర్ స్లిప్పులను వాలంటీర్‌లు లాక్కున్నారు. దీంతో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరుపార్టీల వారిని చెదరగొట్టి.. ఎన్నికలు ప్రశాంతంగా జరుపుతున్నారు.

వైసీపీ అభ్యర్థి గొడవ..  (12:32 PM)

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లీ  ప్రాధమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ అభ్యర్థి చలపాక వెంకట నారాయణ గొడవకు దిగారు. వైసీపీ అభ్యర్థి ఎవరూ పోటిలో లేరని కొంతమంది కావాలని నోటి ప్రచారం చేస్తున్నారంటూ చలపాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

దొంగ ఓటు వేసేందుకు రాగా..(12:31 PM)

ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో దొంగ ఓటు వేసేందుకు వచ్చినందుకు వచ్చిన వ్యక్తులను టీడీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉందని సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.

Updated Date - 2021-04-08T13:04:45+05:30 IST