Abn logo
Sep 22 2021 @ 00:46AM

ఎంపీపీ రేసులో ఇద్దరు!


21ఎన్‌పీ5ఏ బోళెం వెంకటే శ్‌

21ఎన్‌పీ6 సుర్ల రాజేశ్వరి

కుమారుడికి పదవి కోసం వైసీపీ సీనియర్‌ నేత బోళెం ప్రయత్నాలు

కోడలికి పీఠం కోసం పార్టీ మండల అధ్యక్షుడు ‘సుర్ల’ పట్టు


నర్సీపట్నం, సెప్టెంబరు 21 : నర్సీపట్నం ఎంపీపీ పదవిని తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవడానికి వైసీపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకుగాను వైసీపీ 5, టీడీపీ 4 గెలుచుకున్నాయి. వైసీపీకి ఒక స్థానం అధికంగా రావడంతో ఎంపీపీ పదవి ఆ పార్టీకి దక్కే అవకాశం వుంది. కానీ ఈ పదవి కోసం వేములపూడి-2 నుంచి గెలిచిన బోళెం వెంకటేశ్‌, అమలాపురం ఎంపీటీసీ సుర్ల రాజేశ్వరి పోటీ పడుతున్నారు. తన కుమారుడు వెంకటేశ్‌ను ఎంపీపీ చేయాలని సీనియర్‌ నాయకుడు బోళెం నరసింహమూర్తి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా తన కోడలు రాజేశ్వరికి ఎంపీపీ పీఠం కోసం వైసీపీ మండల అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ తీవ్ర కృషి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే గణేశ్‌ ఎవరి పేరు సూచిస్తే వారికే పదవి దక్కే అవకాశం వుంది.