Abn logo
Sep 24 2021 @ 23:41PM

కోలాహలంగా మండలాధీశుల ప్రమాణ స్వీకారం

గణపవరంలో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఎంపీపీ దండు రాము...

ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం.. కో–ఆప్షన్‌, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నిక

తణుకు ఎంపీపీ – రుద్రా ధనరాజు, వైసీపీ

తణుకు, సెప్టెంబరు 24: ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి పీఎస్‌మూర్తి చేయించారు. ముందుగా తెలుగు అక్షరాల క్రమంలో సభ్యులచేత ప్రమాణం చేయించి మధ్యాహ్నానికి సమావేశం వాయిదా వేశారు. మూడు గంటలకు దువ్వ గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు రుద్రా ధనరాజు నామినేషన్‌ ఒక్కటే దాఖల వ్వగా వేల్పూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు చుండ్రు శ్యామల ప్రతిపాదించగా, అదే గ్రామానికి చెంది న పాలా వెంకటదుర్గ బలపర్చారు. దీంతో రుద్రా ధనరా జును ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఉపాధ్యక్షు రాలిగా వేల్పూరు గ్రామానికి చెందిన అయిశెట్టి శేషకు మారి, కోఆప్షన్‌ సభ్యులుగా వేల్పూరుకు చెందిన కత్తుల జెస్‌పాల్‌ను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పీబీఆర్‌ ప్రసాద్‌, బోడ పాటి వీర్రాజు, ఎంపీడీవో టిఎస్‌ఎన్‌ మూర్తి, తహసీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌, అడ్డా బాబు, మట్టా వెంకట్‌ పాల్గొన్నారు

నిడదవోలు ఎంపీపీ – టి. భాగ్యలక్ష్మి, వైసీపీ

నిడదవోలు: నిడదవోలు మండల పరిషత్‌ కార్యాల యంలో శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివా సరావు ఎంపీటీసీలుగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకా రం చేయించారు. దీనికి ముందు కో ఆప్షన్‌ సభ్యత్వానికి వచ్చిన ఒకే ఒక్క నామినేషన్‌ను పరిశీలించి నామినేషన్‌ సమర్పించిన షేక్‌ గౌసియాను ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం మండల పరిషత్‌ ప్రత్యేక సమావేశం నిర్వహి ంచారు. ఈ సమావేశంలో ఎంపీపీగా తాడిమళ్ళ–1 ఎంపీ టీసీ తిరుమళ్ళ భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. వైస్‌ ఎంపీపీగా కోరుమామిడి–1 ఎంపీటీసీ కానుబోయిన ప్రభావతి ఎంపికయ్యారు. 

ప్రమాణ స్వీకారానికి రాని రావిమెట్ల ఎంపీటీసీ

రావిమెట్ల ఎంపీటీసీ ఉప్పులూరి తేజశ్రీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఎంపీపీగా అవకాశమిస్తానన్న అధిష్ఠానం ఆఖరి నిమి షంలో ఇవ్వక పోవడం వల్లే రాలేదని వైసీపీకి చెందిన నాయకులు గుసగుసలాడుకున్నారు.

ఉండ్రాజవరం ఎంపీపీ–పి.యల్లారీశ్వరి, వైసీపీ

ఉండ్రాజవరం: ఉండ్రాజవరం ఎంపీపీగా పాలంగి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు పాలాటి యల్లారీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కాల్థరి ఎంపీటీసీ సభ్యుడు చెట్టే నవీన్‌, కోఆప్షన్‌ సభ్యుడుగా పసలపూడి గ్రామానికి చెందిన షేక్‌ షాజహాన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్‌ అధికారి బి. విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే జి. శ్రీని వాసనాయుడు ఎంపీపీగా ఎన్నికైన యల్లారీశ్వరిని అభిన ందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కరరామయ్య, వ్యవసాయసలహామండలి జిల్లా ఛైర్మన్‌ బూరుగుపల్లి సుబ్బారావు హాజరయ్యారు. 

అత్తిలి–ఎంపీపీ ఎం.సూర్యనారాయణ, వైసీపీ

అత్తిలి: అత్తిలి ఎంపీపీగా తిరుపతిపురం ఎంపీటీసీ మక్కా సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా మంచిలి ఎంపీటీసీ దారం శిరీష ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దరాతి భరణీ ప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, మహ్మద్‌అబీబుద్దిన్‌ తదితరులు అభినందించారు. ఎంపీడీవో వీరాస్వామి, తహసీల్దార్‌ రామాంజనేయులు పాల్గొన్నారు. 

భీమడోలు – కె.రామయ్య, వైసీపీ

భీమడోలు: భీమడోలు ఎంపీపీగా కనమాల రామ య్య, వైఎస్‌ ఎంపీపీ పద్మజ, కోఆప్షన్‌ సభ్యులుగా షేక్‌ ఆజామ్‌ సాహెబ్‌ ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు విచ్చేసి నూతనంగా ఎంపికైన సభ్యుల ను అభినందిం చారు. అనంతరం ఊరేగింపు నిర్వహిం చారు. 

పెరవలి ఎంపీపీ –  కాచర్ల ప్రసాద్‌, వైసీపీ

నిడదవోలు (పెరవలి): పెరవలి మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడిగా ఖండవల్లి ఎంపీటీసీ కాచర్ల ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ముక్కామల ఎంపీటీసీ వేండ్ర శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో ఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌ ఇస్మాయిల్‌ ప్ర మాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు సభ్యులను అభినందించారు.

నిడమర్రు ఎంపీపీ –  ఆదిలక్ష్మి, వైసీపీ

నిడమర్రు: నిడమర్రు కోఆప్షన్‌ సభ్యునిగా మహ్మమ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీగా క్రొవ్విడి ఎంపీటీసీ సభ్యురాలు ధనకొండ ఆదిలక్ష్మి, వైస్‌ ఎంపీపీగా భువనపల్లి ఎంపీటీసీ సమ యం వీరరాఘవులను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోడే కాశీ,  వైసీపీ నాయకులు పుప్పాల చినబాబు, మండల వైసీపీ కన్వినర్‌ సంకు సత్యకుమార్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

పెంటపాడు ఎంపీపీ– డి.హైమావతి, వైసీపీ

పెంటపాడు: పెంటపాడు మండల ఎంపీపీగా పెంటపాడు –1 ఎంపీటీసీ దాసరి హైమావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ ఎంపీపీగా ఆకుతీగపాడు ఎంపీటీసీ కొణతల వెంకట్రావు, కోఆప్షన్‌సభ్యురాలిగా కె.పెంటపాడు గ్రామానికి చెందిన షేక్‌మస్తాన్‌బీబీ  ఎన్ని కయ్యారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ జామి కృష్ణ, తహసీల్దార్‌ శేషగిరిరావు, మండల వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ కైగాల శ్రీనివాస్‌, కర్రిభాస్కరరావు, వైసీపీ మండల గౌరవ అధ్యక్షుడు గుండుమోగుల సాంబయ్య  తదితరులు పాల్గొన్నారు.

గణపవరం ఎంపీపీ – దండు రాము, వైసీపీ

గణపవరం: గణపవరం మండల అధ్యక్షుడిగా దం డు వెంకట రామరాజు (రాము) ఎన్నికయ్యారు. ఉపాధ్య క్షురాలిగా సలాది దుర్గాభవానీ, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ జానీబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికకు ముందు వైసీపీ శ్రేణులు కోమర్రు గ్రామం నుంచి పిప్పర మీదుగా అర్థవరం, గణపవరం, ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్పులు, తీన్‌ మార్‌ డప్పులతో సందడిగా జరిగిన ర్యాలీలో మహిళలు హారతులు పట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతిర్మయి, తహసీల్దార్‌ బొడ్డు శ్రీనివాసరావు, మండల వైసీపీ అధ్యక్షుడు దండు రాము, పార్టీ నాయకులు పుప్పాల పుండరి కాక్షుడు, దండు రాజకుమార్‌రాజు (గోపి), సొసైటీ చైర్‌పర్సన్‌ కొనిశెట్టి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

ఉంగుటూరు ఎంపీపీ – గంటా శ్రీలక్ష్మి, వైసీపీ

ఉంగుటూరు: ఉంగుటూరు మండల పరిషత్తు అధ్యక్షురాలిగా గోపీనాఽథపట్నం ఎంపీటీసీ సభ్యురాలు గంటా శ్రీలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శకో ఆప్షన్‌ సభ్యుడిగా సయ్యద్‌ సత్తార్‌ షాజహాన్‌ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా బొమ్మిడి ఎంపీటీసీ మేడవరపు ఈశ్వరి విద్యాలక్ష్మిని ఎన్నుకొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు నూతన సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఏవీ విజయలక్ష్మి, తహసీల్దార్‌ జాన్‌రాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మరడ రమావతి, జడ్పీటీసీ కొరిపల్లి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇరగవరం ఎంపీపీ– కె.అలివేలు, వైసీపీ

ఇరగవరం: తూర్పువిప్పర్రు గ్రామానికి చెందిన షేక్‌ మాబ్‌ను కో–ఆప్షన్‌ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిషత్‌ అధ్యక్షునిగా కొత్తపాడు, అర్జునుడుపా లెం ఎంపీటీసీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, ఉపాధ్యక్షునిగా కత్తవపాడు, పొదలాడ ఎంపీటీసీ  మల్లిడి నాగవెంకట సత్యనారాయణను ఎన్నుకున్నారు. నూతన సభ్యులను శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మ య్య, జడ్పీటీసీ పంపన అంజిబాబు, వైసీపీ నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, పెన్మెత్స రామభద్రరాజు, చోడే జోషి తదితరులు అభినందించారు.

తాడేపల్లిగూడెం ఎంపీపీ– శేషులత, వైసీపీ

తాడేపల్లిగూడెం రూరల్‌: తాడేపల్లిగూడెం మండల పరిషత్‌ అద్యక్షురాలిగా జగన్నాథపురం–2 ఎంపీటీసీ పును కుమాటి శేషులత ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా కొమ్ము గూడెం ఎంపీటీసీ సూర్పన రామకృష్ణ, కృష్ణాయపాలెంకు చెందిన షేక్‌ సయ్యద్‌ బాషాను కో–ఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ నూతన సభ్యులను అభినందిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీవీకే మల్లికార్జునరావు, జడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కర్రి భాస్కరరావు పాల్గొన్నారు. 


ఉండ్రాజవరం ఎంపీపీ యల్లారీశ్వరిని అభినందిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు...