Abn logo
Sep 25 2021 @ 00:57AM

ఎంపీపీ ఎన్నిక వివాదాస్పదం

మెజారిటీ సభ్యులున్న వారికి దక్కని పదవి

ఎన్నిక నిర్వహించకుండానే మమ అనిపించిన అధికారులు

ఆర్వోను నిలదీసిన ఎంపీటీసీలు.. కార్యాలయం ఎదుట ఆందోళన

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

 తలుపుల సెప్టెంబరు 24: అధికారం చేతిలో ఉందని ప్రజాస్వామ్యాన్ని అప హాస్యం చేశారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రజాతీర్పును గౌరవించకుండా తమకు న చ్చిన వ్యక్తుల కోసం ఇష్టారాజ్యంగా వ్యవహ రించారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు అధికారులు వత్తాసు పలికారు. కళ్ల ముందు అన్యాయం జరు గుతు న్నా.. అధికారులు మాత్రం చేష్టలుడిగి పోయారు. అధికార పార్టీలోని మరో వర్గం తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్లుపై గంటల తరబడి రాస్తారోకో చేస్తున్నారు. ఈ తతంగాన్ని చూసి ప్రజలు యావగిం చుకుంటున్నారు. వివరాలలోకి వెళితే తలుపుల మండలంలో 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఉంటే, పది మంది వైసీపీ, ఇద్దరు టీడీపీ సభ్యులు ఉన్నారు. ఎంపీపీ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే విష యంలో స్థానిక ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి, వైసీపీ సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసుల రెడ్డి మధ్య విభేదాలు వచ్చాయి. పూల శ్రీనివాసులరెడ్డి తన వర్గానికి చెందిన వారిని ఎంపీపీని చేసుకునేందుకు ఆరుగురు వైసీపీ, ఇద్దరు టీడీపీ ఎంపీ టీసీలను తమ వైపు తిప్పుకున్నారు. మిగిలిన నలుగురు ఎంపీటీసీలలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎన్నుకుని ఎమ్మెల్యే తన పంతం నెగ్గించుకున్నాడు.మొదట కోఆప్షన్‌ ఎన్నిక కోసం ముగ్గురు నామినేషన్‌ వేయగా, ఇద్దరిని తిరష్క రించారు. వీరు ఇద్దరు పూల శ్రీనివాసులరెడ్డి వర్గీయులే. ఎంపీపీ ఎన్నిక కోసం మ ధ్యాహ్నం 3 గంటలకు అందరూ లోపలికి వెళ్లారు. వాస్త వానికి మీడియా సమక్షంలోనే ఎన్నిక జరుగు తుంది. గతంలో మున్సి పల్‌ ఎన్నికల్లో కూడా ఇదే కొన సాగింది. అందుకు విరు ద్దంగా వ్యవహరించి, అధికారులు, పోలీ సులు మీడియా ను బయటకు పంపివేశారు. ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీడీఓ కార్యా లయానికి వచ్చి వైసీపీ తరఫున విప్‌జారీ చేసి నట్లు రఫీనాయక్‌ను ఎంపీపీగా ఎంపిక చేసినట్లు వైసీపీ సభ్యు లందరూ ఆయనకే ఓటు వేయాలని సూచించారు. దీనిని పూర్తిగా వ్యతిరేకించిన పూల శ్రీనివాసులరెడ్డి వర్గం బయటకు రావడానికి ప్రయత్నించారు. మహేశ్వరరెడ్డి అధికారులతో తమకు ఇష్టం లేదని, తమ అభ్యర్థి పేరు చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహించి బూ తులు తిట్టిన ట్లు మహేశ్వరరెడ్డి మీడియాకు చెప్పారు. ఎన్నిక జరగకుండానే రఫీనాయక్‌ను, ఓబులేశ్వరమ్మను ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలుగా అధికారులు ప్రకటించారు. అసలు ఎ న్నిక ప్రక్రియ జరుగకుండా ఏవిధంగా చేస్తారని సభ్యులు ప్రశ్నించి నప్పటికీ ఆర్‌ఓ మురళి, ఎంపీడీఓ విష్ణుప్రసాద్‌ నుంచి సరైన సమాధానం రాలేదు. మరో పక్క అత్యధిక ఎంపీటీసీ సభ్యుల అభిప్రాయాన్ని కాదని ఎమ్మెల్యే ఇష్టారా జ్యంగా వ్యవ హరిస్తున్నారని, అధికారం అడ్డంపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని పూల శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆందో ళన కొనసాగుతూనే ఉంది. ఆర్‌డీఓ వెంకటరెడ్డి, డీఎస్పీ భవ్యకిశోర్‌ అక్కడకు చేరుకుని, నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారు పట్టువీడలేదు.