గ్రామాల అభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-05T05:53:28+05:30 IST

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

గ్రామాల అభివృద్ధే ధ్యేయం
ఆద్రాస్‌పల్లిలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను ప్రారంభిస్తున్న ఎంపీపీ

శామీర్‌పేట: ప్రజాసంక్షేమం, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం బాధ్యతగా పనిచేస్తున్నామని మూడుచింతలపల్లి ఎంపీపీ హారికమురళీగౌడ్‌ అన్నారు. మూడుచింతలపల్లి మండలం ఆద్రా్‌సపల్లిలో శుక్రవారం సర్పంచ్‌ లలిత ఆధ్వర్యంలో పంచాయతీ నిధులతో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎంపీపీ మురళీహారికగౌడ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఆద్రా్‌సపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హనుమంతరెడ్డి, ఉప సర్పంచ్‌, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామపెద్దలు, నాయకులు పాల్గొన్నారు.


జీవాలను కాపాడుకోవాలి

శామీర్‌పేట: పాడిరైతులు జీవాలకు కాలానుగుణంగా పశువైద్యులతో మందులు వేయించి కాపాడుకోవాలని ఎంపీపీ హారికమురళీగౌడ్‌ పిలుపునిచ్చారు. మూడుచింతపల్లి మండలం జగ్గంగూడ గ్రామంలో ఆమె పర్యటించారు. పశువైద్యాధికారి డాక్టర్‌ తిరుపతి ఆధ్వర్యంలో మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో బిక్షపతి, యాదగిరి, మల్లేష్‌, బాల మల్లేశ, సత్తయ్య, యాదగిరి, వినయ్‌, రమేష్‌, సుధాకర్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T05:53:28+05:30 IST