సచివాలయ ఉద్యోగులపై ఎంపీడీఓ వివాదాస్పద వాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-11T00:06:26+05:30 IST

ఆందోళన చేస్తున్న సచివాలయ ఉద్యోగులపై గొల్లప్రోలు ఎంపీడీఓ వివాదాస్పద వాఖ్యలు వేశారు. ‘‘వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోవడం కాదు.

సచివాలయ ఉద్యోగులపై ఎంపీడీఓ వివాదాస్పద వాఖ్యలు

కాకినాడ: ఆందోళన చేస్తున్న సచివాలయ ఉద్యోగులపై గొల్లప్రోలు ఎంపీడీఓ వివాదాస్పద వాఖ్యలు వేశారు. ‘‘వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోవడం కాదు. సచివాలయంలో ఉండాల్సిందే. పనిచేయాల్సిందే. ఓటిఎస్ కట్టించాల్సిందే’’ అని ఆదేశించారు. నల్లబ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలపాలని, ఇక్కడ ఉండి కాలక్షేపం చేద్దామంటే ఊరుకోనని హెచ్చరించారు. అన్ని సచివాలయాలకు వస్తానని, తనిఖీ చేస్తానని ఎంపీడీఓ స్పష్టం చేశారు.


డిమాండ్ల సాధన విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పట్టు విడవడంలేదు. ఉద్యోగంలో చేరి రెండేళ్లుదాటినా ప్రొబేషనరీ ప్రకటనపై ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సోమవారం నుంచి ఆందోళనకు దిగారు. సోమవారం ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.


Updated Date - 2022-01-11T00:06:26+05:30 IST