సాకారమయిన కల

ABN , First Publish Date - 2020-10-23T11:11:55+05:30 IST

ఏళ్లతరబడి చేసిన పోరాటాని కి ప్రతిఫలం లభించింది. ఎంపీడీవోలుగా ఎంపికైన వారు ఏళ్ల తరబడి ఉద్యోగోన్నతులకు నోచుకోక ఉన్నచోటే ఉండిపోయే ..

సాకారమయిన కల

ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతులు

జిల్లాకు ముగ్గురు ఇన్‌చార్జ్‌ డీఎల్‌డీవోలు


ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 22: ఏళ్లతరబడి చేసిన పోరాటాని కి ప్రతిఫలం లభించింది. ఎంపీడీవోలుగా ఎంపికైన వారు ఏళ్ల తరబడి ఉద్యోగోన్నతులకు నోచుకోక ఉన్నచోటే ఉండిపోయే వారు. వారి కలలను నిజంచేస్తూ  మూడు రెవెన్యూ డివిజన్‌ లకు  ఇన్‌చార్జ్‌ డీఎల్‌డీవోలుగా ఎంపీడీవోలను నియమిస్తూ గు రువారం పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒం గోలు రెవెన్యూ డివిజన్‌  ఇన్‌చార్జ్‌ డీఎల్‌డీవోగా కొరిశపాడు ఎం పీడీవోతో పాటు జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న బీవీ. సాయికుమారిని నియమించారు. కందుకూ రు డివిజన్‌ ఇన్‌చార్జ్‌  డీఎల్‌డీవోగా  సింగరాయకొండ ఎంపీడీ వోగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌.జమీయుల్లాకు బాధ్యతలు అ ప్పచెప్పారు. మార్కాపురం ఇన్‌చార్జ్‌ డీఎల్‌డీవోగా సా యికుమా ర్‌ను ఎంపికచేశారు. ప్రస్తుతం ఆయన యర్రగొండపాలెం ఎంపీడీవోగా ఉన్నారు


ఏళ్ల తరబడి పోరాటం..

ఎంపీడీవోలు తమ పదోన్నతుల కోసం సంవత్సరాల తరబడి పోరాటం చేశారు. గ్రూప్స్‌ ద్వారా ఎంపికయిన వేరే విభాగాల వారు పనితీరు, సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు సా ధిస్తూ అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. తాము ఒకే పోస్టు లో సంవత్సరాల తరబడి ఉండడాన్ని నిరసిస్తూ అనేక పోరాటా లు ఎంపీడీవోలు చేశారు.  ఆ పోరాటాల ఫలితమే ఈ పదోన్న తులు. ఇటీవలే ప్రభుత్వం డీఎల్‌డీవో పోస్టులను సృష్టిస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది. సీనియారిటీ, ఇతరత్రా అంశాలను పరిగ ణనలోకి తీసుకుని నియమించేసరికి సమయం పడుతున్నం దున ఈలోగా ఇన్‌చార్జ్‌ డీఎల్‌డీవోలుగా నియమించాలని నిర్ణ యించింది. తదనుగుణంగా జిల్లా కలెక్టర్లకు ఎంపిక బాధ్యతల ను అప్పగించింది. సీనియారిటీ, ట్రాక్‌రికార్డు పరిగణనలోకి తీ సుకుని  కలెక్టర్‌ పోలా భాస్కర్‌  ముగ్గురు పేర్లను ప్రభుత్వాని కి నివేదించారు.  వారిని ఇన్‌చార్జ్‌ డీఎల్‌డీవోలుగా నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది


రెవెన్యూ డివిజన్‌లలో ఆర్డీవోలు పర్యవేక్షించే బాఽధ్యతలలో కొ న్నింటిని ఇన్‌చార్జ్‌ డీఎల్‌డీవోలకు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే పాలనను ప్రజలకు చేరువ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఈ కొత్త పోస్టులతో మరో అడుగు ముందుకేసింది. పాలన వికేంద్రీకరణ జరిగి నిర్ణయాలు త్వరితగతిన తీసుకునే వీలు కలగడంతో పాటు ప్రజలకు కూడా మెరుగైన సౌకర్యాలు అందే అవకాశాలు ఉన్నాయి. 

Updated Date - 2020-10-23T11:11:55+05:30 IST