పవర్ పోయాక పదవులిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ..: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2020-10-20T13:42:12+05:30 IST

టీడీపీలో కీలకమైన సంస్థాగత పదవుల ప్రకటనపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు.

పవర్ పోయాక పదవులిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ..: విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: టీడీపీలో కీలకమైన సంస్థాగత పదవుల ప్రకటనపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు. ‘‘అధిరారంతో విర్రవీగిన రోజుల్లో 'అంతు చూస్తా, తోక కోస్తా' అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.



Updated Date - 2020-10-20T13:42:12+05:30 IST