Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 29 Mar 2022 12:33:00 IST

రైతును ఆదుకోండి... కేంద్రానికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

twitter-iconwatsapp-iconfb-icon
రైతును ఆదుకోండి... కేంద్రానికి విజయసాయిరెడ్డి  విజ్ఞప్తి

న్యూఢిల్లీ: నానాటికీ పెరుగుతున్న ఎరువుల ధరలతో  రైతాంగం అతలాకుతలం అవుతోందని, ఎరువులపై సబ్సిడీని పెంచి రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం జీరో అవర్‌లో ఎంపీ ఈ అంశంపై మాట్లాడుతూ గత ఏడాదిగా ఎరువుల ధరలు గణనీయంగా పెరగడంతో రైతాంగం తీవ్ర ఇక్కట్ల పాలవుతోందని అన్నారు. ఏడాది కాలంలో వివిధ ఎరువుల ధరలు సగటున 45 నుంచి 60 శాతం పెరిగాయని, దీని వలన సాగు పెట్టుబడి వ్యయం పెరిగి రైతుల కష్టార్జితానికి గండి పడుతోందన్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి పెరిగిన ఎరువుల ధరలు శరాఘాతంగా పరిణమించాయని  ఎంపీ పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశంలో ఎరువులకు మరింత కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. భారత్‌ ఏటా దిగుమతి చేసుకునే ఎరువులలో 10 శాతం ఈ రెండు దేశాల నుంచే వస్తోందని అన్నారు. పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెంపు మాదిరిగానే ఎరువుల ధరలు కూడా మరింతగా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రైతాంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతుందని అన్నారు.


ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని లక్షా 40 వేల కోట్ల రూపాయల నుంచి లక్షా 5 వేల కోట్ల రూపాయలకు అంటే 30 శాతం తగ్గించిందని తెలిపారు. ఏడాదిగా ఎరువుల ధరలు క్రమేపీ పెరుగుతుంటే ప్రభుత్వం బడ్జెట్‌లో ఎరువులపై సబ్సిడీని గణనీయంగా తగ్గించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి రైతు వ్యతిరేక చర్యకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో రైతాంగాన్నిఆదుకోవలసిన తక్షణ కర్తవ్యం ప్రభుత్వంపై ఉన్నందున వెంటనే ఎరువులపై సబ్సిడీని పెంచాలని విజయసాయి రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.