విశాఖపట్నం: ప్రజాస్వామ్య విమర్శ సహితంగా ఉండాలని.. అసహ్యకరమైన భాష వాడకూడదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. ఇసుకతోట వద్ద జనాగ్రహ దీక్ష చేస్తున్న వారికి మద్దతు పలికిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి, ఎంపీ ఎ౦.వి.వి సత్యనారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి మాట్లాడుతూ 2019 నుండి తెలుగుదేశం పార్టీ అన్నింటిలో ఓటమి చెంది వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ అని అన్నారు. ఆ నాయకుడు ఫస్ట్రేషన్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇష్యూ క్రియేట్ చేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. అసభ్యకరమైన రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారిని దూషించడం చాలా శోచనీయమన్నారు. చంద్రబాబు కుమారుడు అసభ్యకరమైన భాష మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.