ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ విజయసాయి రెడ్డి

ABN , First Publish Date - 2022-08-02T23:41:03+05:30 IST

AP News: ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీశారు. నిత్యావసర ధరల( Essential commoditites) పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రంపై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఏడేళ్లలో గరిష్టానికి

ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ విజయసాయి రెడ్డి

AP News: ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీశారు. నిత్యావసర ధరల( Essential commoditites) పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రంపై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఏడేళ్లలో గరిష్టానికి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. ధరలను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని గుర్తు చేశారు. సెస్సుల పేరుతో రాష్ట్రాలను కేంద్రం దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను చాలా తక్కువగా ఇస్తున్నారని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 41 శాతం పన్నుల వాటాను రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వడం లేదని తెలిపారు. 

Updated Date - 2022-08-02T23:41:03+05:30 IST