ఢిల్లీ: తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు విడుదల చేసి ఏపీని ఆదుకోవాలని కేంద్రాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ జీరో అవర్లో కేంద్రానికి విజయసాయి విజ్ఞప్తి చేశారు. ఏపీలో వరద పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం వాటిళ్లిందన్నారు. సుమారు 44 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.