Abn logo
Sep 25 2021 @ 16:10PM

KBC షోలో.. రూ.50 లక్షలు తీసుకుని వెళ్లిపోతానన్న లెక్కల మాస్టారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బీ

ఇంటర్నెట్ డెస్క్: ఆయన మారమూ పల్లెటూరులో టీచర్. విజిటింగ్ ఫ్యాకల్టీగా 9,10 తరగతి విద్యార్థులకు గణితం బోధిస్తూ ఉంటాడు. కాగా.. ఈ లెక్కల మాస్టారుకు బాలీవుడ్ మెగాస్టార్ నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఆ గణిత మాస్టారు ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆయనకు సంబంధించిన విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


కౌన్ బనేగా కరోడ్పోతి.. బాలీవుడ్ మెగాస్టార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తన్న ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేక్షకుల ఆధారాభిమానాలతో 13వ సీజన్‌లోకి అడుగుపెట్టి.. విజయ వంతంగా దూసుకుపోతోంది. కౌన్ బనేగా కరోడ్పతి షోలో గత గురువారం మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రాంశు త్రిపాఠి అనే వ్యక్తి.. అద్భుత ప్రతిభ కనబర్చి హాట్ సీట్ వరకూ వెళ్లారు. 14 ప్రశ్నలకు అనర్గళంగా ఆన్సర్ చేసి, రూ.50 లక్షలను గెలుచుకున్నారు. ఈ క్రమంలో 15వ ప్రశ్నగా ‘బ్రిటిష్ పైలట్ హెన్రీ అవేరి దోచుకున్న Ganj-i-Sawai అనే రాజ నౌక ఏ భారతీయ పాలకుడికి చెందింది?’ అనే క్వశ్చన్‌ను ఎదుర్కొన్నారు. కోటీ రూపాయల ప్రశ్నకు ప్రాంశు త్రిపాఠి అన్సర్ చేయడం కోసం బిగ్ బీ.. నాలుగు ఆప్షన్‌లను కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నకు సంబంధించిన అంశంపై ప్రాంశు త్రిపాఠికి సరైన అవగాహన లేకపోవడంతో ఆయన రూ. కోటి ప్రశ్నను వదులుకున్నారు. 


రూ.50 లక్షలు తీసుకుని గేమ్ నుంచి తప్పుకున్నారు. అయితే ప్రాంశు ఆట తీరుకు ఫిదా అయిన అమితాబ్.. తాను ధరించిన కోటును గిఫ్ట్‌గా ఇస్తానంటూ షూటింగ్ సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మెగాస్టార్ తాను అన్నమాటను నిలబెట్టకున్నారు. ఓ లేఖతోపాటు.. బిగ్ బీ తన కోటును ప్రాంశు త్రిపాఠికి గిఫ్ట్‌గా పంపించారు. బిగ్ బీ నుంచి వచ్చిన గిఫ్ట్‌తో ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయిన ప్రాంశు త్రిపాఠి.. మాట వరసకు బిగ్ అలా అన్నారేమో అనుకున్నానని.. ఇలా నిజంగానే పంపి.. ఆశ్చర్యపరుస్తారనుకోలేదని సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. మధ్యప్రదేశ్‌లోని చాంద్‌వార్ అనే గ్రామం ప్రాంశు త్రిపాఠి స్వస్థలం. స్థానికంగా ఉన్న ఓ ఉన్నత పాఠశాలలో విజిటింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. ప్రస్తుత క్రికెటర్లలో రోహిత్ శర్మా అంటే.. తనకు చాలా ఇష్టమట.


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...