కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటతప్పాయి: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-02-28T01:25:38+05:30 IST

ఉద్యోగాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటతప్పాయి: రేవంత్ రెడ్డి

రంగారెడ్డి: ఉద్యోగాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.  చేవేళ్ళ నియోజకవర్గంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరుద్యోగులను, ఉద్యోగస్తులను మోసం చేస్తుందని ఆరోపించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తారని  చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని,  అలాగే లక్ష ఉద్యోగాలు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఇప్పటి వరకు 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఓటమి ఖాయమని తెలుసుకున్న కేసీఆర్.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి  పీవీ నరసింహారావు కూతుర్ని నిలబెట్టి ఆయన ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారన్నారు.  


ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T01:25:38+05:30 IST