Abn logo
Jul 31 2021 @ 01:25AM

కోలుకుంటున్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప

ఎంపీ రెడ్డెప్పను పరామర్శిస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి

పుంగనూరు, జూలై 30: పార్లమెంట్‌ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను డిల్లీ ఫోర్టిస్‌ ఆస్పత్రికి తరలించారు. గుండెకు చిన్న రంధ్రం ఉండడంతో వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జి అవుతారని కుటుంబసభ్యులు తెలియజేశారు. ఆయనతోపాటు భార్య రెడ్డెమ్మ, కుమార్తె డాక్టర్‌ హిమబిందు ఉన్నారు. కాగా శుక్రవారం రాజంపేట, కర్నూలు ఎంపీలు మిథున్‌రెడ్డి, సంజీవ్‌ కుమార్‌, పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు ఆస్పత్రికి వెళ్లి ఎంపీ రెడ్డెప్పను పరామర్శించారు. వైద్యులతో ఆయన ఆరోగ్యంపై చర్చించారు.