ఏలూరు: ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత నియోజకవర్గం పర్యటనకు మరోసారి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. రేపు రఘురామకృష్ణంరాజు భీమవరం రావాల్సి ఉంది. మూడు రోజుల పాటు భీమవరంలో మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. రఘురామ భీమవరం పర్యటనను అడ్డుకునే క్రమంలో మరోసారి హైదరాబాద్‌లో ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు(13వ తేదీ) విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే తనకు ఆరోగ్యం సహకరించడం లేదని తరువాత వస్తానని ఎంపీ పేర్కొన్నారు. దీంతో ఈ నెల 17న హాజరు కావాలని సీఐడీ అధికారులు సూచించారు. సీఐడీ నోటీసులతో ఎంపీ భీమవరం పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఆయన రాక కోసం అనుచరులు, సహచరులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.
ఇవి కూడా చదవండి